ఏపీ రైల్వే స్టేషన్లలో ఐసోలేషన్ కోచ్‌లు

ఏపీ రైల్వే స్టేషన్లలో ఐసోలేషన్ కోచ్‌లు
x
Highlights

దేశవ్యాప్తంగా కోవిడ్ మహమ్మారిని ఎదుర్కోవడానికి భారతీయ రైల్వే తన వంతు కృషి చేస్తున్న విషయం తెలిసిందే.

దేశవ్యాప్తంగా కోవిడ్ మహమ్మారిని ఎదుర్కోవడానికి భారతీయ రైల్వే తన వంతు కృషి చేస్తున్న విషయం తెలిసిందే. దక్షిణ మధ్య రైల్వే(scr) రెండు తెలుగు రాష్ట్రాలకు విస్తరించి ఉంది. ఇప్పటికే రైల్వే స్టేషన్లకు ఐసోలేషన్ కోచ్‌లను తరలిస్తోంది. కరోనా వైరస్ కేసులు ఎక్కువగా నమోదై చికిత్సకు సరిపడా గదులు లేనప్పుడు ఈ బోగీలను ఉపయోగించుకోవచ్చని రైల్వే చెబుతోంది.

తెలంగాణలోని సికింద్రాబాద్ హెడ్‌క్వార్టర్‌గా ఉన్న దక్షిణ మధ్య రైల్వే పరిధికి 486 కోచ్‌లు అంటే 7,775 ఐసోలేషన్ బెడ్స్ కేటాయిస్తామని రైల్వే ప్రకటించింది. అందులో భాగంగా నాన్ ఏసీ కోచ్‌లను ఐసోలేషన్ వార్డులుగా మారుస్తోంది. 5,000 బోగీలను 80,000 ఐసోలేషన్ బెడ్స్‌గా మార్చే పనిలో రైల్వే ఉంది. అవసరమైతే మరో 20,000 కోచ్‌లను 3,20,000 ఐసోలేషన్ బెడ్స్‌గా మారుస్తామంటోంది.

ఆంధ్రప్రదేశ్‌లోని నర్సాపురం, మచిలీపట్నం, కాకినాడ, విజయవాడ స్టేషన్లకు 50 కోచ్‌లను సిద్దం చేసి పంపినట్టు రైల్వే ప్రకటించింది. అంటే ఈ 50 కోచ్‌లల్లో 800 ఐసోలేషన్ బెడ్స్ తయారు చేసింది.

రైల్వే తయారు చేసిన కోచ్‌లో ఆక్సిజన్‌తోపాటు వైద్య పరీక్షలకు సంబంధించిన పరికరాలు అన్ని అందుబాటులో ఉన్నాయి. వైద్య సిబ్బందికి ప్రత్యేక గదిని కూడా ఏర్పాటు చేసినట్లు రైల్వే తెలిపింది. కరోనా వైరస్ లక్షణాలు కనిపించగానే వైద్యులను సంప్రదించాలని దక్షిణ మధ్య రైల్వే సూచిస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories