అనంతపురం జిల్లాలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగి మిస్సింగ్ కలకలం

X
Highlights
* చివరగా తన సోదరితో పాటు బంధువులకు వాట్సాప్ * తల్లిదండ్రులు, తన భార్యను జాగ్రత్తగా చూసుకోవాలని మెసేజ్ * ఓ ఫామ్‌హౌస్ దగ్గర లోకేశ్వర్ బైక్ గుర్తింపు * పొలం దగ్గరలోని బావిలో దూకినట్టు అనుమానం * డీఆర్‌ఎఫ్ సిబ్బంది సహాయంతో గాలింపు చర్యలు
Neeta Gurnale13 Nov 2020 8:09 AM GMT
అనంతపురం జిల్లాలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగి మిస్సింగ్ కలకలం రేపుతోంది. యల్లనూరు మండలం వెన్నపూసపల్లికి చెందిన లోకేశ్వర్‌రెడ్డి అదృశ్యమయ్యాడు. చివరగా.. తన సోదరితో పాటు బంధువులకు తల్లిదండ్రులను, తన భార్యను జాగ్రత్తగా చూసుకోవాలంటూ వాట్సాప్‌లో వాయిస్ మెసేజ్ పెట్టాడు. బంధువుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు.. ఓ ఫాంహౌస్ దగ్గర లోకేశ్వర్‌రెడ్డి బైక్‌తో పాటు రక్తపు మరకలను గుర్తించారు. డీఆర్ఎఫ్ సిబ్బంది సహాయంతో పొలం దగ్గరలోని బావిలోకి కెమెరాలను పంపి లోకేశ్వర్‌రెడ్డి ఆచూకీ కోసం గాలిస్తున్నారు.
Web TitleSoftware employee missing in Anantapur Andhra Pradesh
Next Story