తిరుమలలో పాముల కలకలం

తిరుమలలో పాముల కలకలం
x
Highlights

నిత్యం భక్తుల రద్దీతో ఉండే తిరుమలలో విషసర్పాల సంచారం కలకలం రేపుతోంది. పరిసరాల్లో సంచరిస్తున్న భారీ సర్పాలు బుసలు కొడుతూ భక్తులను భయభ్రాంతులకు...

నిత్యం భక్తుల రద్దీతో ఉండే తిరుమలలో విషసర్పాల సంచారం కలకలం రేపుతోంది. పరిసరాల్లో సంచరిస్తున్న భారీ సర్పాలు బుసలు కొడుతూ భక్తులను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. పాములు కనిపించినా ప్రతిసారి స్నేక్ క్యాచర్ భాస్కర్‌నాయుడు పామును పట్టుకుని అడవిలో వదిలిపెడుతున్న భక్తులను పాముల భయం వీడటం లేదు. నిత్యం తిరుమలగిరుల్లో ఏదో ఒక చోట కనిపించడంతో భయంతో వణికిపోతున్నారు. తరచూ కాటేజీలు, జనావాసాల్లో కనిపించి కలవరపెడుతున్నాయి.

నిన్న అలపిరి నడకదారిలో ఏడు అడుగుల నాగుపాము దర్శనమివ్వగా తాజాగా సమిష్టి నిలయంలో 10 అడుగుల కొండచిలువ హల్‌చల్‌ చేసింది. ఇళ్ల మధ్య సంచరిస్తుండడంతో స్థానికులు భయంతో పరుగులు తీశారు. సమాచారం అందుకున్న పాములు పట్టే వ్యక్తి కొండ చిలువను చాకచక్యంగా పట్టుకోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. 9 అడుగుల పొడవు, 30కేజీలపైగా బరువున్న ఈ కొండ చిలువను సంచిలో తీసుకెళ్లి దట్టమైన అడవుల్లో విడిచిపెట్టేసారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories