మరో కీలక నిర్ణయం తీసుకున్న ఏపీ ప్రభుత్వం

మరో కీలక నిర్ణయం తీసుకున్న ఏపీ ప్రభుత్వం
x
Highlights

వైసీపీ అధినేత, వైఎస్ జగన్ నేతృత్వంలోని ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీలో మరో పరిపాలన శాఖను ఏర్పాటు చేసింది.

వైసీపీ అధినేత, వైఎస్ జగన్ నేతృత్వంలోని ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీలో మరో పరిపాలన శాఖను ఏర్పాటు చేసింది. కొత్తగా నైపుణాభివృద్ధి, శిక్షణ విభాగం పేరిట కొత్త పాలనా శాఖను ఏర్పాటు చేస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో ఏర్పాటైన నైపుణ్యాభివృద్ధి, ఉపాధి, ఆవిష్కరణల విభాగాన్ని ఈ నూతన శాఖలో విలీనం చేస్తున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొంది. దీంతో రాష్ట్రంలో 37వ శాఖగా నైపుణ్యాభివృద్ధి, శిక్షణ శాఖ ఏర్పడినట్టయింది. కాగా పరిశ్రమ మంత్రిత్వ శాఖ పరిధిలోకి ఈ శాఖను తీసుకువచ్చింది.

రాష్ట్రంలో ఏర్పాటైన పరిశ్రమల్లో స్థానిక యువతకు 75 శాతం రిజర్వేషన్లు, యువతకు నైపుణ్యాభివృద్ధి, శిక్షణ అంశాలను ఇకనుంచి ఈ శాఖే పర్యవేక్షించనుంది. ఇందుకోసం కార్యదర్శి, అదనపు కార్యదర్శి , కార్యాలయ సిబ్బందిని కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. కాగా ఆంధ్రప్రదేశ్ నైపుణ్యాభివృద్ధి, శిక్షణ కార్పొరేషన్ చైర్మన్ కూడా ఇందులో భాగమవుతారు. నిన్నటినుంచి ఈ శాఖకు సంబంధిన పరిపాలనా ప్రక్రియ ప్రారంభమైనట్టు ప్రభుత్వం తెలిపింది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories