వై.ఎస్.వివేకానంద రెడ్డి హత్య కేసు మలుపు..

వై.ఎస్.వివేకానంద రెడ్డి హత్య కేసు మలుపు..
x
Highlights

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన మాజీ మంత్రి వై.ఎస్.వివేకానంద రెడ్డి హత్య కేసు మలుపు తీసుకుంది. బిజెపి నాయకుడు, మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి...

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన మాజీ మంత్రి వై.ఎస్.వివేకానంద రెడ్డి హత్య కేసు మలుపు తీసుకుంది. బిజెపి నాయకుడు, మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి విచారణకు హాజరుకావాలని పలుమార్లు నోటీసులు ఇచ్చింది సిట్.ఆదినారాయణ రెడ్డి బుధవారం సిట్ వద్దకు వచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఇప్పటివరకు ఫోన్ కాల్‌లపై స్పందించకపోవడంతో సిఆర్‌పిసి సెక్షన్ 160 కింద సిట్ నోటీసులు జారీ చేశారు. దీంతో బుధవారం జరిగే సిట్ విచారణకు ఆదినారాయణ రెడ్డి హాజరవుతారని సమాచారం. ఆయన ఇప్పటికే న్యాయ నిపుణుల సలహా తీసుకున్నాడు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం మాజీ మంత్రి ఆది కోసం ఎదురుచూస్తోంది.

టీడీపీ హయాంలో మంత్రిగా ఉన్న ఆది నారాయణ రెడ్డికి సిట్ అధికారులు మూడు సార్లు నోటీసులు జారీ చేశారు. హత్య కేసులో సిట్ ముందు హాజరు కావాలని కోరారు. అయితే, ఆయన ఈ నోటీసులపై స్పందించలేదు, విచారణకు హాజరు కాలేదు. కాగా ఇప్పటికే వైఎస్ కుటుంబీకులు వైయస్ భాస్కర్ రెడ్డి తోపాటు ఎంపీ అవినాష్ రెడ్డి టిడిపి నాయకులు బిటెక్ రవి, నారాయణ రెడ్డి, ప్రభాకర్ రెడ్డి, రఘునాథ్ రెడ్డి, పరమేష్ రెడ్డి లను విచారించారు. ఆదినారాయణరెడ్డి ద్వారా దర్యాప్తులో కీలక అంశాలు వెలువడతాయని సిట్ అధికారులు భావిస్తున్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories