దహన సంస్కారాలకు జానెడు జాగా చూపించండి మహాప్రభో..!

దహన సంస్కారాలకు జానెడు జాగా చూపించండి మహాప్రభో..!
x

దహన సంస్కారాలకు జానెడు జాగా చూపించండి మహాప్రభో..!

Highlights

కృష్ణా జిల్లా పెడనలో హృదయ విదారక ఘటన దహన సంస్కారాలకు స్థలం లేక కుటుంబసభ్యుల ఆవేదన మృతదేహాన్ని అధికారుల ముందుంచిన కుటుంబసభ‌్యులు జానెడు జాగా చూపించండి అంటూ బాధితుల విన్నపం మరణించి రెండు రోజులు గడిచినా..

పెడన మండలం నందిగామ గ్రామంలో హృదయ విదారకర ఘటన చోటుచేసుకుంది. దహన సంస్కారాలకు స్థలం ఇప్పించాలంటూ కుటుంబ సభ్యులు మృతదేహాన్ని అధికారుల ముందు ఉంచి వేడుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. ఎన్నో ఏళ్లుగా ఇక్కడే జీవనం కొనసాగిస్తున్నాం. మమ్మల్ని మట్టి చేసుకునేందుకు జానెడు జాగా చూపించండి మహా ప్రభో అంటూ బాధితులు విన్నవించారు. మరణించి రెండు రోజులు గడిచినా దహన సంస్కారాలు చేయక పోవడం గ్రామంలో కలకలం రేపింది.

మండల పరిధిలోని నందిగామ గ్రామంలో ఎస్టీ యానాదులకు చెందిన ఈగ రాంబాబు ఆదివారం ఉదయం చనిపోయారు. రాంబాబు మృతదేహాన్ని పూడ్చిపెట్టడానికి కుటుంబ సభ్యులు, బంధువులు సిద్దమయ్యారు. అయితే గ్రామంలో ఉన్న ఏడు శ్మశాన వాటికల్లో పూడ్చిపెట్టడానికి ఆయా సామాజిక వర్గాలు వారు నిరాకరించారు. దీంతో ఏం చేయాలో తోచక మృతదేహాంతో నిరసన చేపట్టారు. తమకు శాశ్వత చిరునామాతో ఆధార్‌కార్డులు జారీ చేశారని, శ్మశాన వాటిక లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నామని ఎస్టీలు వాపోయారు. విషయం తెలిసిన సంఘ నాయకులు ఏకసిరి వెంకటేశ్వరరావు తదితరులు నందిగామ చేరుకుని పరిస్థితి తెలుసుకుని గ్రామ పెద్దలతో మాట్లాడినా ఫలితం లేకపోయింది. చివరకు విషయాన్ని జిల్లా ట్రైబెల్‌ వేల్ఫేర్‌ అధికారి ఎం ఫణిదూర్జిటి, పెడన ఇంఛార్జి తహసీల్దారు కె అనిల్‌కుమార్, పెడన ఎంపీడీవో ఎ అరుణకుమారిల దృష్టికి తీసుకువెళ్లడంతో వారు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని గ్రామంలో శ్మశానాలను, ఖాళీ స్థలాలను పరిశీలించారు. ఇటీవల శ్మశానం కోసం జిల్లా కలెక్టర్‌ను కలిసి స్థలం కేటాయించాల్సిందిగా విజ్జప్తి చేయడం జరిగిందని, నేటి వరకు స్థలం కేటాయించకపోవడంతో ప్రస్తుతం ఇబ్బందులు పడాల్సి వస్తుందని ఈగ రాంబాబు కుటుంబసభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు.

మేం నివాసం ఉంటున్నాం..ఇక్కడ పూడ్చడానికి వీల్లేదు...

నందిగామ గ్రామం నుంచి దావోజిపాలెం గ్రామానికి వెళ్లే ప్రధాన రహదారి పక్కన వడ్డెరకు చెందిన శ్మశానవాటిక ఉంది. అయితే అక్కడ కొందరు కొన్ని సంవత్సరాలు నుంచి శ్మశాన స్థలంలో స్ధిరనివాసం ఏర్పాటు చేసుకుని జీవిస్తున్నారు. ప్రస్తుతం అక్కడ శ్మశానవాటిక ఆనవాళ్లు లేక పచ్చని చెట్లు ఉండటంతో పాటు రాకపోకలు కొనసాగిస్తున్నారు. గతంలో ఇది శ్మశానవాటికే కాబట్టి దీనిని కేటాయిస్తే పరిస్థతి ఎలా ఉంటోందోనని అధికారులు పరిశీలించారు. విషయం తెలిసి అక్కడ నివాసం ఉంటున్న వారు ఇక్కడ పూడ్చిపెట్టడానికి వీల్లేదని, రాకపోకలు చేస్తున్నామని, మీరు పూడ్చిపెడితే మేం కూడా చచ్చిపోతామంటూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు చేసేది లేక వెనుదిరిగారు.

రాంబాబు మృతదేహాన్ని పూడ్చిపెట్టడానికి ఒక రైతు ముందుకు రావడంతో ఆ స్థలంలో పూడ్చిపెట్టడానికి అందరూ అంగీకరించారు. గ్రామ సర్పంచు బొడ్డు చినబాబుతో పాటు ఎస్టీలు భవిష్యత్తులో ఇబ్బందులు లేకుండా చూడాలని, ఇప్పటికే చావుకు దగ్గరగా ఇద్దరున్నారనంటూ ఎస్టీలు ఆవేదన వ్యక్తం చేశారు. సంఘ నాయకుడు ఏకసిరి వెంకటేశ్వరరావు, జిల్లా ట్రైబెల్‌ అధికారి ఫణిదూర్జిటి తదితరులు తప్పకుండా త్వరితగతిన శ్మశానాన్ని చూపిస్తామని హామీ ఇవ్వడంతో రాంబాబు అంత్యక్రియలకు సిద్దమయ్యారు. విషయం తెలిసిన మచిలీపట్నం డీఎస్పీ సీహెచ్‌ రాజా, పెడన సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌ కె నాగేంద్రప్రసాద్, ఎస్‌ఐ సత్యనారాయణలు సంఘటన స్థలానికి చేరుకుని తమ సిబ్బందితో పర్యవేక్షించారు.


దహన సంస్కారాలకు జానెడు జాగా చూపించండి మహాప్రభో..!

కృష్ణాజిల్లా పెడన మండలం నందిగామలో హృదయ విదారకర ఘటన చోటుచేసుకుంది. దహన సంస్కారాలకు స్థలం ఇప్పించాలంటూ కుటుంబ సభ్యులు మృతదేహాన్ని అధికారుల ముందుంచి వేడుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. ఎన్నో ఏళ్లుగా ఇక్కడే జీవనం కొనసాగిస్తున్నాం. మమ్మల్ని మట్టి చేసుకునేందుకు జానెడు జాగా చూపించండి మహా ప్రభో అంటూ బాధితులు విన్నవించారు. మరణించి రెండు రోజులు గడిచినా దహన సంస్కారాలు చేయక పోవడం గ్రామంలో కలకలం రేపింది...


నందిగామ గ్రామంలో ఈగ రాంబాబు ఆదివారం చనిపోయారు. రాంబాబు మృతదేహాన్ని పూడ్చిపెట్టడానికి కుటుంబ సభ్యులు, బంధువులు సిద్దమయ్యారు. అయితే గ్రామంలో ఉన్న ఏడు శ్మశాన వాటికల్లో పూడ్చిపెట్టడానికి ఆయా సామాజిక వర్గాలు వారు నిరాకరించారు. దీంతో ఏం చేయాలో తోచక మృతదేహాంతో నిరసన చేపట్టారు. తమకు శాశ్వత చిరునామాతో ఆధార్‌కార్డులు జారీ చేశారని, శ్మశాన వాటిక లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నామని ఓ వర్గం వారు వాపోయారు.


విషయం తెలిసిన సంఘ నాయకులు గ్రామ పెద్దలతో మాట్లాడినా ఫలితం లేకపోయింది. చివరకు విషయాన్ని జిల్లా ట్రైబెల్‌ వేల్ఫేర్‌ అధికారి, పెడన ఇంఛార్జి తహసీల్దార్ అనిల్‌‎, ఎంపీడీవో దృష్టికి తీసుకువెళ్లారు. దీంతో వారు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని గ్రామంలో శ్మశానాలను, ఖాళీ స్థలాలను పరిశీలించారు. ఇటీవల శ్మశానం కోసం జిల్లా కలెక్టర్‌ను కలిసి స్థలం కేటాయించాల్సిందిగా విజ్జప్తి చేయడం జరిగిందని.. ఇప్పటికీ స్థలం కేటాయించకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని కుటుంబసభ‌్యులు ఆవేదన వ్యక్తం చేశారు.


రాంబాబు మృతదేహాన్ని పూడ్చిపెట్టడానికి ఒక వ్యక్తి ముందుకురావడంతో ఆ స్థలంలో పూడ్చిపెట్టడానికి అందరూ అంగీకరించారు. ట్రైబల్‌ అధికారి, తదితరులు తప్పకుండా త్వరితగతిన శ్మశానాన్ని చూపిస్తామని హామీ ఇవ్వడంతో రాంబాబు అంత్యక్రియలకు సిద్దమయ్యారు.

Show Full Article
Print Article
Next Story
More Stories