వైసీపీ విద్యార్థి విభాగం నాయకుడికి కీలక పదవి

వైసీపీ విద్యార్థి విభాగం నాయకుడికి  కీలక పదవి
x
Highlights

వైసీపీ విద్యార్థి విభాగం నాయకుడికి కీలక పదవిని కట్టబెట్టారు ముఖ్యమంత్రి జగన్.

వైసీపీ విద్యార్థి విభాగం నాయకుడికి కీలక పదవిని కట్టబెట్టారు ముఖ్యమంత్రి జగన్. ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ సభ్యుడిగా షేక్‌ సలాంబాబును నియమించారు. ఈ మేరకు జీవో 127 ద్వారా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్‌వీ సుబ్రమణ్యం ఉత్తర్వులు జారీ చేశారు. కడప జిల్లా సీకె దిన్నె మండలం, సీఎంఆర్‌ పల్లెకు చెందిన సలాంబాబు.. వైసీపీలో కీలకమైన విద్యార్థి విభాగానికి అధ్యక్షుడిగా చాల ఏళ్ళనుంచి పనిచేస్తున్నారు.

స్టూడెంట్‌ వింగ్ కు రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేస్తూ విద్యార్థుల సమస్యలు పరిష్కరించడంలో కీలక పాత్ర పోషించారు. ప్రత్యేక హోదాకోసం పోరాటాలు, ఉద్యమాలు చేశారు. కడప ఉక్కు పరిశ్రమ, విశాఖ రైల్వేజోన్‌ వంటి సమస్యలపై పోరాడారు. ఆ సమయంలో కొన్ని రోజులు జైల్లో కూడా ఉన్నారు. ఈ సందర్భంగా సలాంబాబు మాట్లాడుతూ తనపై నమ్మకముంచి ఏపీపీఎస్సీ సభ్యుడిగా నియమించిన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు కృతజ్ఞతలు తెలిపారు సలాంబాబు.

Show Full Article
Print Article
Next Story
More Stories