రాష్ట్రపతి విశాఖ పర్యటన షెడ్యూల్‌ ఖరారు

Shedule Fix for President visits Visakhapatnam
x

రాష్ట్రపతి విశాఖ పర్యటన షెడ్యూల్‌ ఖరారు

Highlights

VisakhaPatnam: ఈ నెల 20 నుంచి రెండ్రోజుల పాటు విశాఖలో కోవింద్‌ పర్యటన.

VisakhaPatnam: రాష్ట్రపతి రామనాథ్‌ కోవింద్‌ విశాఖ పర్యటన షెడ్యూల్‌ ఖరారైంది. ఈ నెల 20 నుంచి రెండ్రోజుల పాటు విశాఖలో కోవింద్‌ పర్యటించనున్నారు. 20న భువనేశ్వర్‌ నుంచి ప్రత్యేక విమానంలో విశాఖ చేరుకుంటారు. అనంతరం నేవల్‌ ఎయిర్‌ స్టేషన్‌కు చేరుకుని ప్రెసిడెన్షియల్‌ సూట్‌ కి వెళ్తారు. అక్కడ రాత్రికి బస చేస్తారు. 21న ఉదయం నేవల్‌ డాక్‌యార్డుకు చేరుకుని ఫ్లీట్‌ రివ్యూలో పాల్గొంటారు. ఈ కార్యక్రమానికి పలువురు కేంద్ర మంత్రులతో పాటు సీఎం జగన్‌ హాజరుకానున్నారు. ఇక.. మధ్యాహ్నం పీఎఫ్‌ఆర్‌ గ్రూప్‌ ఫొటో కార్యక్రమంలో రాష్ట్రపతి పాల్గొంటారు. 22వ తేదీ ఉదయం ప్రత్యేక విమానంలో ఢిల్లీకి తిరుగు పయనమవుతారు రాష్ట్రపతి రామ్‌నాథ్‌. ప్రెసిడెంట్‌ పర్యటన నేపథ్యంలో పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories