Indrakeeladri: ఇవాళ రెండు అవతారాల్లో అమ్మవారి దర్శనం

Sharan Navaratri Celebrations At Vijayawada Indrakeeladri
x

Indrakeeladri: ఇవాళ రెండు అవతారాల్లో అమ్మవారి దర్శనం

Highlights

Indrakeeladri: మధ్యాహ్నం 12 గంటల వరకు శ్రీమహిషాసురమర్దినీ దేవిగా దర్శనం

Indrakeeladri: విజయవాడ ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రి వేడుకలు చివరిరోజుకు చేరుకున్నాయి. ఈరోజు రెండు అలంకరణలలో దర్శనం ఇవ్వనున్నారు అమ్మవారు. తెల్లవారుజామున 3 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మహార్నవమి గడియల్లో శ్రీ మహిషాసుర మర్దినీ దేవిగా దర్శనమిస్తారు. రాక్షసులను సంహరించి స్వయంభుగా వెలిసిన మహిషాసురమర్దినీ అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరారు. మధ్యాహ్నం నుంచి దశమి గడియల్లో అంటే విజయదశమి నాడు శ్రీ రాజరాజేశ్వరిదేవిగా అమ్మవారు భక్తులను అనుగ్రహించనున్నారు.

విజయదశమి నాడు అమ్మవారిని దర్శించుకుంటే అన్ని విజయాలు చేకూరతాయని భక్తుల విశ్వాసం. రాజరాజేశ్వరీ దేవిని సేవించడం వలన జీవితం ధన్యమవుతుందని, నవరాత్రుల పుణ్యఫలం, సకల శుభాలు, విజయాలు సిద్దిస్తాయని భక్తుల నమ్మకం. ఇదిలా ఉంటే.. ఇవాళ సాయంత్రం కృష్ణానదికి ఉత్సవ మూర్తులను పోలీసులు ఊరేగింపుగా దుర్గాఘాట్‌కు తీసుకెళ్తారు. గంగా పార్వతి సమేత మల్లేశ్వరుల స్వామివార్లు హంసవాహాణంపై నదివిహారం చేస్తారు.

Show Full Article
Print Article
Next Story
More Stories