కాలేజ్ హాస్టల్ పక్కనే కాల్‌గర్ల్స్.. మంగళగిరిలో వ్యభిచార ముఠా గుట్టురట్టు

కాలేజ్ హాస్టల్ పక్కనే కాల్‌గర్ల్స్.. మంగళగిరిలో వ్యభిచార ముఠా గుట్టురట్టు
x
Highlights

గుంటూరు జిల్లాలో కొంతకాలంగా గుట్టుచప్పుడు కాకుండా ఓ అపార్ట్‌మెంట్లో వ్యభిచారం నిర్వహిస్తున్న ముఠాను ధ్వంసం చేశారు పోలీసులు.. నిర్వాహకులు, విటులు,...

గుంటూరు జిల్లాలో కొంతకాలంగా గుట్టుచప్పుడు కాకుండా ఓ అపార్ట్‌మెంట్లో వ్యభిచారం నిర్వహిస్తున్న ముఠాను ధ్వంసం చేశారు పోలీసులు.. నిర్వాహకులు, విటులు, పలువురు మహిళలను అరెస్టు చేశారు. మంగళగిరి మండలం చినకాకాని పరిధిలో ఓ భవనంలో నిర్వహిస్తున్న వ్యభిచార గృహంపై మంగళగిరి రూరల్ పోలీసులు దాడులు చేశారు. రద్దీగా ఉండే ఓ ప్రముఖ కళాశాల హాస్టల్ విద్యార్థులు, పరిసరాల్లో ఉండే వ్యక్తులను ఈ ముఠా టార్గెట్ చేసుకొని కొంతకాలంగా వ్యభిచారం సాగిస్తోంది.

దీనిపై స్థానికులు కొందరు గమనించి.. పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు వ్యభిచార గృహంపై దాడులు చేసి ఆరుగురిని అరెస్టు చేశారు. వారిని స్టేషన్ కు పంపించారు. అందులో ఇద్దరు విటులు కాగా, నలుగురు నిర్వాహకులు ఉన్నట్లు తెలుస్తోంది. వారి వద్ద నుంచి రూ.11 వేల నగదును స్వాధీనం చేసుకున్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories