ఏపీలో మద్యనిషేధం అమలుపై సీరియస్ గా దృష్టి.. ఇప్పటికే వందలాది కేసులు..

ఏపీలో మద్యనిషేధం అమలుపై సీరియస్ గా దృష్టి.. ఇప్పటికే వందలాది కేసులు..
x
Highlights

మద్యపాన నిషేధం అమలుపై సీరియస్ గా దృష్టిసారించింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. నూతన మద్యం పాలసీ పకడ్బందీగా అమలవుతుందో లేదో తెలుసుకునేందుకు రాష్ట్ర...

మద్యపాన నిషేధం అమలుపై సీరియస్ గా దృష్టిసారించింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. నూతన మద్యం పాలసీ పకడ్బందీగా అమలవుతుందో లేదో తెలుసుకునేందుకు రాష్ట్ర వ్యాప్తంగా దాడులు నిర్వహించింది. దాడుల్లో భాగంగా అక్టోబర్ 1 నుంచి ఇప్పటి వరకు 208 నాటు సారా కేసులు, బెల్ట్ షాపులలో మద్యం విక్రయాలకు సంబంధించి 480 కేసులు నమోదు చేశారు, మొత్తం 518 మంది వ్యక్తులను అరెస్ట్ చేసి వారి వద్దనుంచి 9858 . 44 లీటర్ల నాటు సారా, 2 ,49 ,217 లీటర్ల పులిసిని, 63 వాహనములను స్వాధీనం చేసుకున్నట్టు చెప్పారు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ ఆఫ్ సి .హరికుమార్. ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు.

అలాగే బెల్ట్ షాపులలో మద్యం విక్రయాలకు సంబంధించి 480 కేసులు నమోదు చేశామని.. ఇందులో 484 మందిని అరెస్ట్ చేసి 5996.115 లీటర్ల మద్యం , 1020.04 లీటర్ల బీరు, 19 వాహనములను స్వాధీనం చేసుకున్నామన్నారు. పొరుగు రాష్ట్రాల నుంచి ట్యాక్స్ కట్టని మద్యంనకు సంబంధించి 124 కేసులు నమోదు చేసి 123 మందిని అరెస్ట్ చేసి 146.85 లీటర్ల మద్యం , 14.83 లీటర్ల బీరు, 26 వాహనాలను స్వాధీనం చేసుకున్నట్టు హరికుమార్ తెలియజేశారు. నాటు సారా నిర్మూలనకై రాష్ట్రం లోని 13 జిల్లాలలో టాస్క్ ఫోర్స్ , ఎన్ఫోర్స్మెంట్ విభాగాలకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చామని ఆయన స్పష్టం చేశారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories