
టీడీపీకి మరో షాక్ తగిలింది. ఆ పార్టీకి ప్రాధమిక సభ్యత్వానికి మాజీ మంత్రి డొక్కా మాణిక్యవరప్రసాద్ రావు రాజీనామా చేశారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను అధిష్టానానికి పంపించారు.
టీడీపీకి మరో షాక్ తగిలింది. ఆ పార్టీకి ప్రాధమిక సభ్యత్వానికి మాజీ మంత్రి డొక్కా మాణిక్యవరప్రసాద్ రావు రాజీనామా చేశారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను అధిష్టానానికి పంపించారు. రాజీనామా లేఖలో టీడీపీ అధిష్టానం వైఖరి తీవ్ర ఆవేదనకు గురిచేసిందని పేర్కొన్నారు. అలాగే జేఏసీ పేరుతో తనపై తప్పుడు ఆరోపణలు చేశారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తనపై టీడీపీ నేతలు చేస్తున్న చౌకబారు విమర్శలు మానుకోవాలని సూచించారు. మరికొద్ది రోజుల్లో తన అభిమానులు, కార్యకర్తలతో సమావేశం అయిన తరువాత భవిశ్యత్ కార్యాచరణ ప్రకటిస్తానని ఆయన వెల్లడించారు.
కాగా సీనియర్ లీడర్, సీజనల్ పొలిటీషియన్ గా పేరొందిన డొక్కా కాంగ్రెస్ లో సుదీర్ఘకాలం పనిచేశారు. వైఎస్, రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డి ల హయాంలో మంత్రిగా పనిచేశారు. అయితే రాష్ట్ర విభజన అనంతరం టీడీపీలో చేరారు. 2014 నుంచి ఆ పార్టీ లోనే కొనసాగుతున్నారు. అయితే మూడు రాజధానుల అంశం తెరపైకి రాగానే ఆయన వ్యూహాత్మకంగా టీడీపీకి దూరంగా ఉంటూ వస్తున్నారు. ఇటీవల తన ఎమ్మెల్సీ పదవికి కూడా రాజీనామా చేశారు. మరోవైపు బుధవారం ఆయన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో వైసీపీలో చేరాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.

About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire



