సీనియర్‌ జర్నలిస్ట్‌ రాఘవాచారి కన్నుమూత

సీనియర్‌ జర్నలిస్ట్‌ రాఘవాచారి కన్నుమూత
x
Highlights

ప్రముఖ పాత్రికేయులు, విశాలాంధ్ర మాజీ ఎడిటర్‌ చక్రవర్తుల రాఘవాచారి కన్నుమూశారు. గత కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఆస్పత్రిలో చికిత్స...

ప్రముఖ పాత్రికేయులు, విశాలాంధ్ర మాజీ ఎడిటర్‌ చక్రవర్తుల రాఘవాచారి కన్నుమూశారు. గత కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. ఆయన భౌతికకాయాన్ని మఖ్ధుమ్‌ భవన్‌కు తరలించారు. రాఘవాచారి పార్థివ దేహానికి సీపీఐ నేతలు చాడ వెంకటరెడ్డి, నారాయణ నివాళులు అర్పించారు. విశాలాంధ్ర గౌరవ చైర్మన్‌ ముప్పాళ్ల నాగేశ్వరరావు సంతాపం తెలిపారు. రాఘవాచారి భౌతికకాయాన్ని విశాలాంధ్ర కార్యాలయానికి తరలించనున్నారు.

రాఘవాచారి 1939 సెప్టెంబరు 10వ తేదీన ఆయన జన్మించారు. ఆయన స్వస్థలం వరంగల్‌ జిల్లా పాలకుర్తి మండలం శాతాపురం. 33 ఏళ్లుపాటు విశాలాంధ్ర దినపత్రికకు సంపాదకులుగా పనిచేశారు. నిబద్ధతత, విలువలతో కూడిన జర్నలిజం చేశారాయన.. రాఘవాచారి మృతిపట్ల ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్ రెడ్డి సంతాపం తెలిపారు.. జర్నలిజం వృత్తిలో విలువల కోసం ఆయన కృషి చేశారని, రాబోయే తరాలకు రాఘవాచారి రచనలు స్ఫుర్తిదాయకమని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories