Corona Effect: తూ.గో జిల్లాలో సెమీ లాక్‌డౌన్‌

Corona Virus File Photo
x

కరోనా వైరస్ ప్రతీకాత్మక 

Highlights

Corona Effect: తూర్పుగోదావరి జిల్లాను కరోనా వణికిస్తుంది.

Corona Effect: తూర్పుగోదావరి జిల్లాను కరోనా వణికిస్తుంది. దీంతో జిల్లా వర్తకప్యాపారులు సెమీ లాక్‌డౌన్‌ పాటిస్తున్నారు. మార్కెట్లు, వ్యాపార, వాణిజ్య సముదాయాల్లో ప్రజల రద్దీని నియంత్రించేందుకు రాజమండ్రి ఛాంబర్ ఆఫ్ కామర్స్, శ్రీ వెంకటేశ్వర మార్కెట్ సంఘం, కూరగాయల మార్కెట్ కమిటీలు సంయుక్తంగా కీలకమైన నిర్ణయం తీసుకున్నాయి. రాజమండ్రి కార్పొరేషన్ పరిధిలోని అన్ని దుకాణాలు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకే తెరిచి ఉంచేలా ఆదేశాలు జారీ చేశారు.

మరోవైపు మిగిలిన వ్యాపారస్తులు సైతం ఇదే తరహాలో దుకాణాలను సాయంత్రం 5 తర్వాత క్లోజ్ చేస్తున్నారు. సెల్ఫ్‌ లాక్‌డౌన్‌తో కాస్తైనా కరోనాను కంట్రోల్‌ చేయవచ్చని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. వ్యాపారుల నిర్ణయంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. అయితే జనం రద్దీగా కనిపించే మాల్స్, షాపింగ్ మాల్స్‌ కూడా స్వీయ నియంత్రణ పాటించాలని పలువురు భావిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories