TTD: టీటీడీ విజిలెన్స్ అదుపులో ఇంటి దొంగ.. 42 వేలకు 6 వీఐపీ బ్రేక్ టికెట్ల విక్రయం

Selling 6 VIP Break Tickets For 42 Thousand
x

TTD: టీటీడీ విజిలెన్స్ అదుపులో ఇంటి దొంగ.. 42 వేలకు 6 వీఐపీ బ్రేక్ టికెట్ల విక్రయం

Highlights

TTD: విచారణలో బయటపడ్డ శంకరయ్య పాత్ర

TTD: శ్రీవారి వీఐపీ బ్రేక్ టికెట్లను బ్లాక్‌లో విక్రయించి విజిలెన్స్ అధికారులకు పట్టుబడ్డా టీటీడీ ఉద్యోగి. తిరుపతికి చెందిన శంకరయ్య టీటీడీ ఇంజినీరింగ్ విభాగంలో మజ్జూర్గా పని చేస్తున్నాడు. హైదరాబాద్‌కు చెందిన వేణుగోపాల్ వీఐపీ బ్రేక్ దర్శనం కావాలని శంకరయ్యను సంప్రదించాడు. ఓ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ సిఫార్సు లేఖపై 3 వేల విలువ కలిగిన 6 వీఐపీ బ్రేక్ దర్శన టికెట్లను పొందిన శంకరయ్య... 42 వేలకు విక్రయించాడు. ఈ టికెట్లతో బుధవారం ఉదయం వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌కు చేరుకున్న వేణుగోపాల్ బృందాన్ని విజిలెన్స్ అధికారులు అనుమానంతో తనిఖీ చేశారు. విచారణలో శంకరయ్య పాత్ర బయటపడింది. దీంతో విజిలెన్స్ అధికారులు కేసును టూటౌన్ పోలీసులకు బదిలీ చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories