Seetharama Swamy Temple Property: కబ్జాలో ఉన్న సీతారామస్వామి ఆలయ ఆస్తులు స్వాధీనం!

Seetharama Swamy Temple Property: కబ్జాలో ఉన్న సీతారామస్వామి ఆలయ ఆస్తులు స్వాధీనం!
x

Sri Seetharamaswamy Temple (file image)

Highlights

Seetharama Swamy Temple Property: ఎట్టకేలకు దశాబ్ధాలుగా అక్రమణదారుల చెరలో ఉన్న దేవాలయ ఆస్తులకు విముక్తి లభించింది.

ఈ నెల 2నే చివరి నోటీసు ఇచ్చిన దేవాదాయశాఖ అధికారులు..

13 సెంట్లలో మూడంతస్థుల పక్కా భవనం, కారం మిల్లు, రేకుల షెడ్డు స్వాధీనం..

బెదిరింపులకు లొంగేదిలేదంటున్న అసిస్టెంట్ కమీషనర్ శాంతి

----

విశాఖజిల్లా, నర్సీపట్నం.

ఎట్టకేలకు దశాబ్ధాలుగా అక్రమణదారుల చెరలో ఉన్న దేవాలయ ఆస్తులకు విముక్తి లభించింది. ఏళ్ల తరబడి న్యాయస్థానంలో వివాదంలో ఉన్న ఈ ఆస్థుల వ్యవహారం తుది దశకు చేరింది. దీంతో దేవాదాయ శాఖకు చెందిన అధికారుల పర్యవేక్షణలో దీనికి సంబంధించిన 13 సెంట్లలో మూడంతస్థుల పక్కా భవనం, కారం మిల్లు, రేకుల షెడ్డును గురువారం స్వాధీనం చేసుకున్నారు. వివరాల్లోకి వెళితే...

చారిత్రాత్మక ప్రాధాన్యత ఉన్న నర్సీపట్నం నడిబొడ్డులో 18వ శతాబ్దంనాటి ఏకశిలా సీతా రామస్వామి దేవాలయం ఉంది. ఈ ఆలయానికి భద్రాచలం తర్వాత అంతటి ప్రాధాన్యత ఉండటంతో భక్తులు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంటారు. దీనిలో భాగంగానే ఆలయం నిర్వహణకు ఎటువంటి ఇబ్బందులు రాకుండా అప్పట్లోని దాతలు కొన్ని భూములను దానం చేశారు. ఈ విధంగా మొత్తం 55 సెంట్ల భూమి పట్టణం నడిబొడ్డులో ఈ ఆలయానికి ధఖలయ్యింది. అయితే దీనికి సంబంధించి ఆలయం ఉన్న 7 సెంట్లు మినహా మిగిలిన భూమి అంతా అక్రమణదారుల చెరలోకి వెళ్లింది. దీనిలో పాత బస్టాండు ఆవరణలో ఉన్న 35 సెంట్ల భూమితో పాటు ఆలయాన్ని ఆనుకుని ఉన్న 13 సెంట్లు విస్తీర్ణంలో మూడంస్థుల భవనాన్ని నిర్మాణం చేసి యధేశ్చగా వ్యాపారం నిర్వహించుకుంటున్నారు. దీంతో పాటు కారం మిల్లు కొనసాగిస్తున్నారు.

దీనిపై 2000 సంవత్సరం లో దేవాదాయశాఖ దృష్టకి తీసుకెళ్లగా అప్పటి ప్రభుత్వ ఆదేశాల ప్రకారం దేవాదాయ శాఖ ఉన్నధికారులు ఆలయాన్ని సందర్సించి విచారణ చేపట్టారు. అలయ ఆస్తులు అన్యాక్రాంతం చేసిన వారిపై దేవాదాయ చట్టం సెక్షన్ 83 ప్రకారం కేసులు నమోదు చేశారు. దేవాదాయ శాఖ డిప్యూటీ కమీషణర్ వారి కోర్టులో 2000 సం,, కేసులునమోదు చేసి అనాటి నుండీ 2010 వరకు వాదనలు విచారణ చేసి ట్రిబ్యునల్ కి పంపడం

జరిగింది. 2010 నుండి 2019 వరకూ విచారణ జరిపిన ట్రిబ్యునల్ కొర్టు 30-7-2019 న అస్తులు దేవాలయమునకు చెందినవిగా తీర్పు ఇచ్చినట్టు అధికారులు వెల్లడించారు. నాటి నుండి అదికారులు

పలు ధపాలు అన్యాక్రాంతులను ఖాళీ చేయమని కోరగా వారు స్పందించలేదు. దీనికి సబంధించి చివరిగా

2 - 9-2020 న ఆలయ కార్యనిర్వహణా అధికారె స్వయంగా నోటీసులను అన్యాక్రాంతులకి ఇచ్చి 10 రోజుల వ్యవధిలో ఆలయ ఆస్తుల నుండి ఖాళీ చేసి వెళ్ళవలసినది అని లేదా చట్టరిత్యా తగు చర్యలు తీసుకుంటామని తెలియజేయడం జరిగిందన్నారు. దీంతో పాటు ఈ నోటీసులను సదరు అస్తులపై నోటిసులు అంటించినారు...

దీనిపై ఆక్రమణదారులు స్పందించకపోవడంతో గురువారం దేవాదాయశాఖ అసిస్టెంట్ కమీషనర్ శాంతి ఆధ్వర్యంలో చట్టపరంగా ఆలయ ఆస్తులను స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా అసిస్టెంట్ కమీషనర్ మాట్లాడుతూ ఆక్రమణలు తొలగించే సమయంలో కొంతమంది బెదిరింపులకు పాల్పడ్డారన్నారు. అటువంటి బెదిరింపులకు లొంగేది లేదన్నారు. ఇదే కాకుండా ఇంకా ఆక్రమణలో మిగిలిఉన్న ఆస్థులను సైతం వీలైనంత తొందర్లోనే స్వాధీనం చేసుకుంటామన్నారు. ఈ వ్యవహారంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు అవసరమైన చర్యలు తీసుకున్నారు.

.

Show Full Article
Print Article
Next Story
More Stories