Adeep Raj: సీతంరాజు సుధాకర్ విజయానికి సమష్టిగా కృషి చేయాలి

Seethamraju Sudhakar Should Work Together For Success
x

Adeep Raj: సీతంరాజు సుధాకర్ విజయానికి సమష్టిగా కృషి చేయాలి 

Highlights

Adeep Raj: ముఖ్యనేతల సమావేశంలో ఎమ్మెల్యే అదీప్

Seethamraju Sudhakar: ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా YSR CP బలపర్చిన సీతంరాజు సుధాకర్ విజయానికి పార్టీ నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు అందరూ కృషి చేయాలని ఎమ్మెల్యే అన్నంరెడ్డి అదీప్ రాజ్ పిలుపునిచ్చారు. పెందుర్తి మండలం రాంపురంలోని YSR CP కార్యాలయంలో సీతంరాజు సుధాకర్‌తో కలిసి ఎమ్మెల్యే పార్టీ ముఖ్యనేతలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు సీఎం జగన్‌మోహన్ రెడ్డి పాలనలో ప్రతి ఒక్కరికీ మంచి జరుగుతోందన్నారు. కరోనా సమయంలో కూడా రాష్ట్ర ప్రజలను సీఎం ఆదుకున్నారన్నారు. రానున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో YSR CP బలపర్చిన సీతంరాజు సుధాకర్‌ను గెలిపించాలని కోరారు. పార్టీ శ్రేణులంతా కష్టపడి పనిచేయాలని కోరారు. ఎమ్మెల్సీ అభ్యర్థి సీతంరాజు సుధాకర్ మాట్లాడారు. రాష్ట్రంలో YSR CPకి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని, ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా YSR CP విజయకేతనం ఎగురవేస్తుందని తెలిపారు. ఉద్యోగులంతా తమ వెంటే ఉన్నారన్నారు. ఏ ప్రాంతం, ఏ వర్గం తమకు వ్యతిరేకం కాదన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో తాను విజయం సాధిస్తానని సుధాకర్ ధీమా వ్యక్తం చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories