Vishakapatnam: రేపు విశాఖకు ప్రధాని మోడీ..

* 6వేల700 మంది పోలీసులతో భారీ బందోబస్తు.. బాంబ్ స్క్వాడ్ బృందాలతో నగరం జల్లెడ

R Tripura Malini
Updated on: 10 Nov 2022 11:59 AM IST
security will be tightened in vizag during prime minister modi two-day visit
X

ప్రధాని మోడీ రేపు విశాఖకు రానున్నారు

Prime Minister Modi: ప్రధాని మోడీ రేపు విశాఖకు రానున్నారు. ప్రధాని విశాఖ పర్యటన నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. 6వేల7 వందల మంది పోలీసులతో కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. బాంబ్ స్క్వాడ్ బృందాలతో నగరాన్ని జల్లెడపడుతున్నారు. విశాఖలో అణువణువూ తనిఖీలు చేస్తున్నారు. వీఐపీల నుంచి సామాన్య ప్రజల వరకు ప్రధాని పర్యటనలో పాల్గొనేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. విశాఖ పర్యటనలో ప్రధాని మోడీ పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయనున్నారు.

R Tripura Malini

R Tripura Malini

Next Story