మంత్రి చేసిన వ్యాఖ్యలు బాధాకరం-నిమ్మగడ్డ

X
Highlights
పంచాయతీ ఎన్నికల నిర్వహణ విషయంలో తనకు అధికారులతో ఎటువంటి ఇబ్బందులు లేవని SEC నిమ్మగడ్డ స్పష్టం చేశారు....
Samba Siva Rao27 Jan 2021 3:25 PM GMT
పంచాయతీ ఎన్నికల నిర్వహణ విషయంలో తనకు అధికారులతో ఎటువంటి ఇబ్బందులు లేవని SEC నిమ్మగడ్డ స్పష్టం చేశారు. ప్రభుత్వం, SEC మధ్య వివాదాలు లేకుండా పరిష్కరిస్తానని గవర్నర్ హామీ ఇచ్చినట్లు నిమ్మగడ్డ తెలిపారు. అధికారులపై తాను కక్ష సాధింపు చర్యలకు పాల్పడడం లేదని SEC నిమ్మగడ్డ రమేశ్ కుమార్ స్పష్టం చేశారు. ఇద్దరు అధికారులపై ఈసీ చర్యలు తీసుకుంటే ..మంత్రి చేసిన వ్యాఖ్యలు బాధాకరమని నిమ్మగడ్డ అన్నారు. ఇద్దరు అధికారులపై చర్యలు తీసుకుంది వాస్తవమేనని... వారిని అభిశంసన చేశాంగానీ సస్పెండ్ చేయలేదని స్పష్టం చేశారు.
Web TitleNimmgadda reacts to minister peddireddy comments
Next Story