ఎస్ఈసీ నిమ్మగడ్డ మరో సంచలన నిర్ణయం

X
Nimmagadda Ramesh (file image)
Highlights
* ఇద్దరు పంచాయతీరాజ్ ఉన్నతాధికారులపై వేటు * ప్రిన్సిపల్ సెక్రటరీ గోపాలకృష్ణ ద్వివేది, కమిషనర్ గిరిజాశంకర్ బదిలీకి ఆదేశం * ఎస్ఈసీ ఆదేశాలను అమలుచేసిన ప్రభుత్వం
Sandeep Eggoju25 Jan 2021 3:15 PM GMT
సుప్రీం తీర్పుతో మరింత దూకుడు పెంచిన ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. తాను ఎన్నిసార్లు పిలిచినా సమావేశానికి హాజరుకాని పంచాయతీరాజ్ ప్రిన్సిపల్ సెక్రటరీ గోపాలకృష్ణ ద్వివేది, కమిషనర్ గిరిజాశంకర్‌పై వేటు వేశారు. గోపాలకృష్ణ ద్వివేది, గిరిజాశంకర్‌ను బదిలీ చేయాలని ఉత్తర్వులు జారీ చేసింది. దాంతో, ఎస్‌ఈసీ ఆదేశాలను ప్రభుత్వం వెంటనే అమలు చేసింది. గోపాలకృష్ణ ద్వివేది, గిరిజాశంకర్ స్థానాల్లో కొత్త వారిని నియమించేందుకు ముగ్గురు అధికారులతో కూడిన జాబితాను ఎస్‌ఈసీకి సీఎస్ పంపనున్నారు.
Web TitleSEC Nimmagadda Ramesh is Taken another sensational decision
Next Story