ఏపీలో రేషన్ పంపిణీ వాహనాలపై ఎస్‌ఈసీ ఆదేశాలు జారీ

X
ఫైల్ ఇమేజ్
Highlights
ఏపీలో రేషన్ పంపిణీ వాహనాలపై ఎస్‌ఈసీ ఆదేశాలు జారీ చేసింది. ఇంటింటికి రేషన్ పంపిణీపై ఆంక్షలు విధించింది....
Sandeep Eggoju6 Feb 2021 3:20 AM GMT
ఏపీలో రేషన్ పంపిణీ వాహనాలపై ఎస్‌ఈసీ ఆదేశాలు జారీ చేసింది. ఇంటింటికి రేషన్ పంపిణీపై ఆంక్షలు విధించింది. రేషన్ సరుకులు పంపిణీ చేసే వాహనాలపై రంగులు మార్చకపోతే వాహనాలకు పర్మిషన్ ఇవ్వబోమని స్పష్టం చేసింది ఎన్నికల కమిషన్. వాహనాలకు రంగులు మార్చి తమకు చూపిన తర్వాతే అనుమతి ఇస్తామన్నారు. ఒకవేళ వాహనాల రంగు మార్చకపోతే ఎన్నికలు జరిగే ప్రాంతాల్లో సదరు వాహనాలను తిప్పవద్దని సూచించింది ఎన్నికల కమిషన్. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది కనుక మార్చిన రంగులతోనే వాహనాలు తిప్పాలన్నారు.
Web TitleSEC Issued the directives on ration distribution vehicles in AP
Next Story