ఎస్‌ఈసీ నిర్ణయం బాధాకరం - ఉద్యోగ సంఘాలు

X
Employee union member image
Highlights
* ఇప్పటికే కరోనాతో చాలామందిని కోల్పోయాం మా ప్రాణాలతో చెలగాటమాడొద్దు -ఉద్యోగ సంఘాలు * పోలీసులు తీవ్ర ఒత్తిడి ఎదుర్కొంటున్నారు -ఉద్యోగ సంఘాలు
Sandeep Eggoju9 Jan 2021 10:11 AM GMT
ఏపీ స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై ఎస్‌ఈసీ నిర్ణయం బాధాకరమని అన్నారు ఉద్యోగ సంఘాల నేతలు. ఇప్పటికే కరోనాతో చాలా మంది ఉద్యోగులను కోల్పోయామని ఇప్పుడు తమ ప్రాణాలతో ఆడుకోవద్దని ఆవేదన వ్యక్తం చేశారు. ఎస్‌ఈసీ తమ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటే అందరికీ మంచిదని చెప్పారు. ఇప్పటికే పోలీసులు తీవ్ర ఒత్తిడి ఎదుర్కొంటున్నారని ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎన్నికలు నిర్వహించడం సరికాదని ఉద్యోగ సంఘాల నేతలు అభిప్రాయపడ్డారు. ఎన్నికలకు తాము వ్యతిరేకం కాదని, ప్రస్తుత సమయంలో ఎన్నికలు వాయిదా వేయాలనే కోరుతున్నామన్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి వసంత్ అందిస్తారు.
Web TitleSEC Decisions are Painful Says Employee Unions
Next Story