ఎస్‌ఈబీ నిర్ణయంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న ఆక్వా రైతులు.. ఆధార్ ఉంటేనే...

SEB Decided to Sell or Buy Jaggery There Must be Aadhar Card | Aqua Farmers Problems
x

ఎస్‌ఈబీ నిర్ణయంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న ఆక్వా రైతులు.. ఆధార్ ఉంటేనే...

Highlights

Aqua Farmers: ఆక్వా సాగులో బెల్లం వినియోగం ఎక్కవగా ఉంటుంది...

Aqua Farmers: పశ్చిమ గోదావరి జిల్లాలో నాటుసారా నిర్మూలించడానికి S.E.B. తీసుకువచ్చిన నూతన నిబంధనలతో ఆక్వా రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రొయ్యల పెంపకంలో ముఖ్య భూమిక పోషించే బెల్లం మార్కెట్‌లో దొరకక ఆక్వా రైతులకు, అటు సామాన్య ప్రజలు సైతం లబోదిబోమంటున్నారు. మరోవైపు బెల్లం అమ్మకాలు లేక బెల్లం రైతులు గడ్డుకాలం ఎదుర్కుంటుంటే S.E.B పెట్టిన నిబంధనలు వారికి ములుగేనక్కపై తాటిపండు పడినట్లైంది.

పశ్చిమగోదావరి జిల్లా ఆకివీడు మార్కెట్‌లో బెల్లం కొనాలంటే ఆధార్‌ కార్డు చూపించాలంటూ వ్యాపారస్తులు కరాకండిగా చెప్తున్నారు. దీంతో కొత్తగా ఇదేం చిత్రమని బెల్లం వినియోగదారులు నివ్వెరపోతున్నారు. సారా తయారీని అరికట్టేందుకు బెల్లం అమ్మకాలపై అధికారులు కఠిన ఆంక్షలు విధించారు. పది కిలోల బెల్లం అమ్మాలంటే కొనుగోలుదారుడి ఆధార్‌ కార్డును తీసుకోవాలని వ్యాపారులకు ఆదేశాలు జారీ చేశారు.

దీంతో పాటు వ్యాపారస్తులు తమ వద్ద ఉన్న బెల్లం నిల్వలు, ఎవరెవరికి అమ్మారో వివరాలు చెప్పాలని అధికారులు కోరుతున్నారు. దీంతో మార్కెట్‌లో ఏ దుకాణానికి వెళ్లినా బెల్లం లభించడం లేదు. ఎవరు ఎందుకు తీసుకెళతారో తెలియని పరిస్థితిలో తమకెందుకు లేనిపోని సమస్యలు అనుకుంటూ వ్యాపారస్తులు బెల్లం అమ్మకాలు మానేశారు. కొంతమంది దగ్గర బెల్లం నిల్వలు ఉన్నా విక్రయించేందుకు నిరాకరిస్తున్నారు.

ఇదిలా ఉంటె పశ్చిమగోదావరిలో బెల్లం దొరకక ఆక్వాకు తీవ్ర నష్టం వాటిళ్లుతుంది. ఆక్వా సాగులో బెల్లం వినియోగం ఎక్కువగా ఉంటుంది. రొయ్యలకు ఇవ్వాల్సిన ఆహారంతో పాటు మందులలో బెల్లం ఎక్కువగా ఉపయోగిస్తారు. బెల్లం రొయ్యలకు ప్రొపబెటిక్‌గా ఉపయోగపడుతుంది. దీంతో ఆక్వా రైతులు ఎక్కువ మొత్తంలో బెల్లం కొనుగోలు చేస్తుంటారు. అధిక విస్తీర్ణంలోని ఆక్వా సాగుకు అధిక మొత్తంలో టన్నుల కొద్ది బెల్లం అవసరం ఉంది.

ఆధార్‌ కార్డు తీసుకొచ్చి కొనుగోలు చేయాలనే నిబంధనతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పోనీ ఆధార్ చూపించి కొనుగోలు చేద్దామన్నా బెల్లం లభించడం లేదు. దీంతో ఆక్వా రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బెల్లం తయారు చేసే రైతులు బెల్లం అమ్మకాలు లేక ఇబ్బందులు పడుతుంటే, కొనుగోలు చేసేందుకు బెల్లం దొరకక ఆక్వా రైతులు ఇబ్బందులు పడుతున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories