Andhra News: అర్ధరాత్రి నుంచి తెల్లవారుజాము వరకు పిల్లల వద్దకు రాని పులి

Search for Mother Tiger in Nandyala District
x

Andhra News: అర్ధరాత్రి నుంచి తెల్లవారుజాము వరకు పిల్లల వద్దకు రాని పులి

Highlights

Andhra News: ఆత్మకూరు అటవీ డివిజన్ అధికారుల దగ్గర 4 పులి కూనలు

Nandyala: నంద్యాల జిల్లా కొత్తపల్లి మండలం పెద్దగుమ్మాడపురంలో తల్లి పులి కోసం ఫారెస్ట్ అధికారుల అన్వేషణ కొనసాగుతోంది. ఆత్మకూరు అటవీ డివిజన్‌లో స్థానికులకు నాలుగు పులి పిల్లలు దొరికినప్పటికీ... అవి తల్లి పులి చెంతకు చేరలేకపోయాయి. పులి కూనలను తల్లి చెంతకు చేర్చడంలో అటవీ అధికారులు చేస్తున్న ప్రయత్నాలు విఫలమవుతున్నాయి. పులి కూనలు దొరికిన ప్రాంతంలో ట్రాప్ కెమెరాల సాయంతో తల్లి పులి ఆచూకీ కోసం అధికారులు చెమటోడుస్తున్నారు.

తల్లి పులిని టీ-108గా గుర్తించి అన్వేషణ ముమ్మరం చేశారు. అర్ధరాత్రి నుంచి తెల్లవారుజాము వరకు పిల్లల వద్దకు తల్లి పులి రాలేదు. దీంతో అధికారులు తర్జనభర్జన పడుతున్నారు. ఈ క్రమంలో ముసలిమడుగు సమీప చింతకుంట ప్రాంతం నుంచి కూనలతో ఆత్మకూరులు అధికారులు వెనుతిరిగారు. తదుపరి చర్యల కోసం NTCA ఆదేశాల కోసం అటవీ ఉన్నత అధికారులు ఎదురుచూస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories