ఏపీలో రేపటి నుంచి తెరుచుకోనున్న పాఠశాలలు

ఏపీలో రేపటి నుంచి తెరుచుకోనున్న పాఠశాలలు
x
Highlights

ఏపీలో రేపటి నుంచి బడి గంటలు మొగుతాయని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి అదిమూలపు సురేష్ అన్నారు. రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఒంగోలు కలెక్టరేట్ వద్ద నిర్వహించిన కార్యక్రమం తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు.

ఏపీలో రేపటి నుంచి బడి గంటలు మొగుతాయని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి అదిమూలపు సురేష్ అన్నారు. రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఒంగోలు కలెక్టరేట్ వద్ద నిర్వహించిన కార్యక్రమం తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. కొవిడ్ నేపథ్యంలో అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని తెలిపారు. విడతల వారీగా అన్ని తరగతులను ప్రారంభిస్తామని, విద్యా సంవత్సరం నష్టపోకుండా తరగతుల నిర్వహణకు ఏర్పాట్లు చేశామని చెప్పారు. విద్యార్థులు తప్పనిసరిగా మాస్కు ధరించి నియమ నిబంధనలు పాటిస్తూ స్కూళ్లకు హాజరు కావాలని మంత్రి సురేష్ స్పష్టం చేశారు.

అటు ఏపీలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. శనివారం నాటికీ ఉన్న సమాచారం ప్రకారం... గడిచిన 24 గంటల్లో 84,401 కరోనా టెస్టులు చేయగా 2,886 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఈ మేరకు వైద్య ఆరోగ్య శాఖ హెల్త్ బులిటెన్ ని విడుదల చేసింది. తాజా కేసులతో కలిపి రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 8,20,453 కి చేరుకుంది. అయితే ఇందులో 24,575 యాక్టివ్ కేసులుండగా 7,92,083 మంది కరోనా నుంచి కోలుకున్నారు. గడిచిన 24 గంటల్లో 3,708 మంది కరోనా నుంచి కోలుకున్నారు. అటు గడిచిన 24 గంటల్లో కరోనాతో కొత్తగా 17 మంది చనిపోయారు. దీనితో మృతుల సంఖ్య 6,676కి చేరుకుంది.


Show Full Article
Print Article
Next Story
More Stories