వైరల్ వీడియో : వైసీపీ ఎమ్మెల్యే విడదల రజినికి ముద్దు పెట్టిన బుడతడు

వైరల్ వీడియో : వైసీపీ ఎమ్మెల్యే విడదల రజినికి ముద్దు పెట్టిన బుడతడు
x
rajini
Highlights

చిలకలూరు పేట నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే విడదల రజిని మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావుపై మొన్నటి ఎన్నికల్లో ఘనవిజయం సాధిచిన సంగతి తెలిసిందే.

చిలకలూరు పేట నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే విడదల రజిని మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావుపై మొన్నటి ఎన్నికల్లో ఘనవిజయం సాధిచిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ప్రభుత్వ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే రజినికి వింత అనుభవం ఎదురైంది. నియోజకవర్గంలోని ఓ స్కూల్‌లో జరిగిన కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్యే రజిని అక్కడ విద్యార్ధులతో సరదాగా సంభాషించారు. అనంతరం ఎమ్మెల్యే విద్యార్ధులను వరుసగా పలకరిస్తూ షేక్ హ్యండ్ ఇస్తు వస్తున్నారు.

కాగా లైన్ లో నిలుచోని ఉన్న ఓ బుడతడు ఎమ్మెల్యే బుగ్గను గిల్లి ముద్దు పెట్టాడు. దీంతో ఎమ్మెల్యే షాక్ గురైయ్యారు. తర్వాత తెరుకుని సరదాగా నవ్వుకుంటూ వెళ్లిపోయారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories