ఏపీలో ఇంగ్లీష్ మీడియంపై SCERT ఇచ్చిన రిపోర్ట్..

ఏపీలో ఇంగ్లీష్ మీడియంపై SCERT ఇచ్చిన రిపోర్ట్..
x
Highlights

ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాద్యమాన్ని తప్పనిసరి చేస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే.

ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాద్యమాన్ని తప్పనిసరి చేస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఏపీ సర్కార్ జారీ చేసిన జీవో 81, 85ను ఏపీ హైకోర్టు కొట్టేసింది. ఏ మీడియంలో చదుకోవాలి అన్నది విద్యార్థులు, తల్లిదండ్రుల ఇష్టమని అభిప్రాయపడింది. దీనిపై ప్రభుత్వం విద్యార్థుల నుంచి వారి తల్లిదండ్రుల నుంచి అభిప్రాయాలు సేకరించిన సంగతి తెలిసిందే.

తాజాగా ఇంగ్లీష్ మీడియం పై SCERT ఇచ్చిన రిపోర్ట్ ను అధ్యయనం చేశారు పాఠశాల విద్యా కమిషనర్. SCERT ఇచ్చిన సూచనలతో అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో 1 నుంచి 6 వ తరగతి వరకు ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టాలని ప్రభుత్వాన్ని కోరినప్పటికి, మైనారిటీ పాఠశాల లు యధావిధిగా కొనసాగించవచ్చని కమిషనర్ పేర్కొన్నారు.

ఒకవేళ అక్కడ ఎవరన్నా ఇంగ్లీష్ మీడియం కోరితే, ప్రత్యేక సెక్షన్ ఏర్పాటు చేయాలని సూచించారు. 17,97,168 మంది విద్యార్థుల్లో కేవలం 53,947 మంది మాత్రమే తెలుగు మీడియం వైపు మొగ్గు చూపినట్లు వెల్లడించారు. విద్యార్థులు కోరిన ప్రతి చోటా తెలుగు మీడియం ఏర్పాటు సాధ్యం కాదని, మండలానికి ఒక స్కూల్ చొప్పున 672 తెలుగు మీడియం స్కూల్స్ ఏర్పాటు చేయాలని కమిషనర్ పేర్కొన్నారు.

తెలుగు మీడియం కోరిన విద్యార్థులకు ఉచిత రవాణా, లేదా అందుకు ఖర్చయ్యే మొత్తాన్ని విద్యార్థులకు ప్రభుత్వం చెల్లించాలన్నారు. ఒక్కొక్కరికి సుమారు ఆరు వేల రూపాయలు ఖర్చు అవుతుందని అంచనా. ప్రభుత్వంపై కేవలం 32 కోట్ల రూపాయల భారం పడనుంది. SCERT రిపోర్టును అంగీకరించడంతో పాటు, పాఠశాల విద్యా కమిషనర్ సూచనలు కూడా పరిగణలోకి తీసుకుంటూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. అయితే సుప్రీం కోర్ట్ ఇచ్చే తీర్పు ప్రకారమే ఇంగ్లీష్ మీడియం పై తుది నిర్ణయం తీసుకుంటామని ఉత్తర్వుల్లో ప్రభుత్వం పేర్కొంది.


Show Full Article
Print Article
Next Story
More Stories