మహిళల ఆర్థికాభివృద్ధికి ఎస్‌బీఐ చేయూత

మహిళల ఆర్థికాభివృద్ధికి ఎస్‌బీఐ చేయూత
x
Highlights

డ్వాక్రా సంఘాల మహిళలు ఆర్థిక స్వావలంబన సాధించేందుకు భారతీయ స్టేట్ బ్యాంక్ ఎటువంటి హామీలు లేకుండా రుణాలు మంజూరు.

పెందుర్తి: డ్వాక్రా సంఘాల మహిళలు ఆర్థిక స్వావలంబన సాధించేందుకు భారతీయ స్టేట్ బ్యాంక్ ఎటువంటి హామీలు లేకుండా రుణాలు మంజూరు చేసి చేయూత ఇస్తోందని ఎస్‌బీఐ చీఫ్‌ జనరల్‌ మేనేజర్‌ మణిపల్వేశణ్‌ అన్నారు. ఆయన పెందుర్తి ఎస్‌బీఐ శాఖను సందర్శించారు.

బ్యాంకు ద్వారా 42 డ్వాక్రా బృందాలకు మంజూరు చేసిన రూ.3 కోట్ల రుణాలకు సంబంధించిన చెక్కును ఆయా సంఘాల ప్రతినిధులకు అందజేశారు. తీసుకున్న రుణాలను సకాలంలో చెల్లించి మరింత సాయం పొందాలని సూచించారు. పెందుర్తి ఎస్‌బీఐ శాఖ మేనేజర్‌ ఎస్‌.శోభన్‌బాబు, బ్యాంకు ఏజీఎం వై.నాగేశ్వరరావు, పీఆర్వో రామ్మూర్తినాయుడు, ఎస్‌వీ.రమణమూర్తి, భాస్కర్, ఎ.మహేశ్, ఎన్‌.కాత్యాయని, పాల్గొన్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories