వైసీపీ ఎమ్మెల్యే ఇంట విషాదం..

వైసీపీ ఎమ్మెల్యే ఇంట విషాదం..
x
Highlights

చిత్తూరు జిల్లా సత్యవేడు వైసీపీ ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం ఇంట విషాదం నెలకొంది. ఆదిమూలం తల్లి కాంతమ్మ మరణించారు. గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో...

చిత్తూరు జిల్లా సత్యవేడు వైసీపీ ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం ఇంట విషాదం నెలకొంది. ఆదిమూలం తల్లి కాంతమ్మ మరణించారు. గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న కాంతమ్మ తన స్వగ్రామం నారాయణవనం మండలంలోని భీముని చెరువులో గురువారం తుదిశ్వాస విడిచారు. తల్లి మృతితో ఆదిమూలం తీవ్ర విషాదంలో మునిగిపోయారు. తల్లి అనారోగ్యం కారణంగా రెండు రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలకు దూరంగా ఉన్నారు ఆదిమూలం. ఎమ్మెల్యే తల్లి మృతితో ఆయనను పరామర్శించేందుకు వైసీపీ నేతలు, కార్యకర్తలు వెళ్లారు.

ఆదిమూలం కుటుంబానికి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి, మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డిలు ప్రగాడ సంతాపం తెలియజేశారు. భీముని చెరువులో కాంతమ్మ అంత్యక్రియలు జరుగుతాయని కుటుంబసభ్యులు వెల్లడించారు. కాగా 2010 లో రాజకీయాల్లోకి వచ్చిన కోనేటి ఆదిమూలం 2014 లో వైసీపీ తరుపున సత్యవేడు నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేశారు.. కానీ ఓటమి చెందారు. ఆ తరువాత 2019 ఎన్నికల్లో తిరిగి పోటీ చేసి ఎమ్మెల్యేగా విజయం సాధించారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories