'సర్వేపల్లి రైతు కానుక' ను పంపిణీ చేసిన ఎమ్మెల్యే కాకాణి

సర్వేపల్లి రైతు కానుక ను పంపిణీ చేసిన ఎమ్మెల్యే కాకాణి
x
Kakani Govardhan Reddy
Highlights

కరోనా కష్ట కాలంలో కొందరిలా ఆయన ఇంటికే పరిమితం కాలేదు. అందరిలో ఒకడైనా అందరి కోసం ఒక్కడై నిలిచారు.

పొదలకూరు: కరోనా కష్ట కాలంలో కొందరిలా ఆయన ఇంటికే పరిమితం కాలేదు. అందరిలో ఒకడైనా అందరి కోసం ఒక్కడై నిలిచారు. పనులు లేక పస్తులు ఉంటున్న పేదల పాలిట దేవుడుగా మారారు. గత మూడు వారాలుగా నిరంతరాయంగా పేదలకు సేవ చేస్తూనే ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్ గడువు పొడిగించడంతో, సేవా కార్యక్రమాలను కూడా కొనసాగిస్తున్నారు. ఆయనే సర్వేపల్లి శాసనసభ్యులు కాకాని గోవర్ధన్ రెడ్డి... దేశంతో పాటు రాష్ట్రం లోకి కరోనా వైరస్ ప్రవేశించడంతో, దేశ ప్రధాని మోడీ గత నెల మార్చి 22న జనతా కర్ఫ్యూ విధించారు. ఆ మరుసటి రోజు నుంచే లాక్ డౌన్ ప్రకటించారు .దీంతో ప్రజలందరూ ఇళ్లకే పరిమితమయ్యారు.

ఈ పరిస్థితుల్లో సర్వేపల్లి నియోజకవర్గ ప్రజలను ఆదుకునేందుకు ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్ రెడ్డి నడుంబిగించారు .ఆ రోజు నుంచి నియోజకవర్గంలోని ఐదు మండలాల్లో పేద ప్రజలకు కూరగాయలు, పాలు, నిత్యావసర సరుకులు అందజేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్ ను మే నెల మూడో తేదీ వరకు పొడిగించింది. దీంతో కాకాణి సేవా కార్యక్రమాల ను కూడా కొనసాగిస్తున్నారు .రాష్ట్ర ప్రభుత్వం అందించే రేషన్ బియ్యం తో పాటు మరికొంత బియ్యం అందించాలనే సదాశయంతో సర్వేపల్లి రైతన్న కానుక కు శ్రీకారం చుట్టారు. ఈ కానుక కు నియోజకవర్గంలోని రైతులు అందరూ స్వచ్చందంగా ధాన్యాన్ని విరాళమిచ్చారు.

సేకరించిన ధాన్యాన్ని బియ్యంగా మార్చి నియోజకవర్గంలోని లక్ష రేషన్ కార్డు హోల్డర్లకు గత నాలుగు రోజుల నుంచి అందిస్తున్నారు. అలాగే బియ్యం తో పాటు వంట నూనె ప్యాకెట్లను కూడా పంపిణీ చేస్తున్నారు. పొదలకూరు మండలంలోని అంకుపల్లి,వావింటపర్తి,పులికల్లు గ్రామాల్లో బుధవారం కాకాణి పర్యటించి ప్రజలకు బియ్యం, వంటనూనెప్యాకెట్లు పంపిణీ చేశారు. ఇద్దరు కుటుంబ సభ్యులు ఉన్న కుటుంబానికి 5 కేజీలు, ఇద్దరు కంటే ఎక్కువ ఉన్న కుటుంబానికి 10 కేజీలు వంతున బియ్యం అందజేశారు. అలాగే ఇద్దరు కుటుంబ సభ్యులకు అరకిలో పామాయిల్, ఇద్దరి కంటే ఎక్కువ ఉన్నవారికి కిలో పామాయిల్ వంతున పంపిణీ చేశారు.


జిల్లాలో సాగులో ఉన్న కూరగాయలు సరిపోకపోవడంతో, వ్యయప్రయాసలకోర్చి ఇతర జిల్లాల నుంచి కూడా కూరగాయలు తెప్పించి పంపిణీ చేస్తున్నారు. అంతేకాకుండా కరోనా ను కట్టడి చేసేందుకు తన వంతు ప్రయత్నాలు నియోజకవర్గంలో చేపట్టారు. పారిశుద్ధ్యం మెరుగుకు తగు ఏర్పాటు చేశారు. ప్రాణాలకు తెగించి పారిశుద్ధ్య చర్యల్లో పాల్గొంటున్న పారిశుధ్య కార్మికులను సన్మానించి, వారి రక్షణకు అవసరమైన కిట్లను అందజేశారు. అలాగే వారికి నిత్యావసర సరుకులు, బియ్యం పంపిణీ చేశారు. లాక్ డౌన్ ప్రకటించిన నాటి నుంచి ఏ ఒక్క రోజు విరామం లేకుండా, నియోజకవర్గంలో అన్ని గ్రామాల్లో పర్యటిస్తూ ప్రజలకు అండగా నిలబడుతున్నారు.

పొదలకూరు మండలంలోని కాకాణి యువసేనతో పాటు, మిగిలిన నాలుగు మండలాల్లో ఉన్న ఆయన అభిమానులు సహాయ సహకారాలు అందిస్తున్నారు. ప్రతిరోజూ తమ పరిధిలోని పేదలకు భోజన సదుపాయం ఏర్పాటు చేస్తున్నారు. మనసున్న మారాజు చేయూతతో, పేద కుటుంబాల్లోని ప్రతి ఒక్కరికీ మూడు పూటలా నాలుగు వేళ్ళు నోట్లోకి వెళుతున్నాయని పలువురు కాకాణిని ప్రశంసిస్తున్నారు. ఎమ్మెల్యే కాకాణి తో పాటు రైతులు రాష్ట్రానికే కాకుండా, దేశానికే ఆదర్శంగా నిలిచారని సర్వేపల్లి నియోజకవర్గ ప్రజలు కొనియాడుతున్నారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories