నారావారిపల్లెకు సంక్రాంతి కళ..

నారావారిపల్లెకు సంక్రాంతి కళ..
x
Highlights

నారావారిపల్లె సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటాయి. ప్రతి ఏటా మాదిరిగానే ఈ ఏడాది నారా.. నందమూరి కుటుంబ సభ్యులు గ్రామంలో జరుగుతున్న సంక్రాంతి వేడుకల్లో...

నారావారిపల్లె సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటాయి. ప్రతి ఏటా మాదిరిగానే ఈ ఏడాది నారా.. నందమూరి కుటుంబ సభ్యులు గ్రామంలో జరుగుతున్న సంక్రాంతి వేడుకల్లో పాల్గొన్నారు. నారా, నందమూరి కుటుంబ సభ్యుల రాకతో ప్రత్యేక శోభ సంతరించుకుంది.

నారావారి పల్లె సంక్రాంతి శోభ సంతరించుకుంది. ప్రతి ఏటా సంక్రాంతిని స్వగ్రామంలో జరుపుకోవడం ఆనవాయితీగా మార్చుకున్న సీఎం చంద్రబాబు ఈసారి కూడా పండుగను సొంతూరులోనే జరుపుకుంటున్నారు. నారా, నందమూరి కుటుంబ సభ్యులు నారావారిపల్లెకు చేరుకున్నారు.

సంక్రాంతి వేడుకల్లో పాల్గొనేందుకు వచ్చిన సీఎం సతీమణి నారా భువనేశ్వరీ , మంత్రి నారా లోకేష్, బ్రాహ్మణి ఇతర కుటుంబ సభ్యులకు ఘనస్వాగతం పలికారు. నారా, నందమూరి కుటుంబాలు గ్రామానికి చేరుకోవడంతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

గ్రామంలో నిర్వహించిన పలు కార్యక్రమాల్లో నారా భువనేశ్వరి కుటుంబ సభ్యులు, స్థానికులతో కలిసి పాల్గొన్నారు. మహిళా శిశు సంక్షేమ శాఖ ఏర్పాటు చేసిన ముగ్గుల పోటీలను, అంగన్ వాడిలో అందిస్తున్న పౌష్టికాహరం స్టాల్ ను పరిశీలించారు. టిటిడి కళ్యాణ మండపంలో వినాయక విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమంలో పాల్గొని గ్రామీణ సంప్రదాయ క్రీడలను వీక్షించారు. గ్రామంలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న నారా లోకేష్, బ్రాహ్మణి తనయుడు దేవాన్ష్ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు.

తొమ్మిది సంవత్సరాలుగా నారావారిపల్లిలో సంక్రాంతి వేడకలో పాల్గొనడం ఎంతో ఆనందంగా ఉందన్నారు నారా భువనేశ్వరి. ప్రజలు తమ సొంత ఊర్లో పెద్దలు గ్రామస్తులతో కలిసి సంక్రాంతి పండుగ జరుపుకోవాలన్నారు. ప్రతి ఒక్కరు కష్టపడి సంపద సృష్టించి దేశ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.

సంపూర్ణ ఆరోగ్యానికి క్రీడలు ఎంతో దోహదపడుతాయన్నారు నారా బ్రాహ్మణి. పల్లెటూరు క్రీడలు మనస్సుకు ఎంతో ప్రశాంతతనిస్తాయన్నారామె. సంక్రాంతి సందర్భంగా నిర్వహించిన ఆట‌ల పోటీల‌లో ప్రతిభ కనబరిచిన వారికి బహుమతులు అందచేశారు..

సోమ, మంగళవారాల్లో సీఎం చంద్రబాబు కుటుంబం నారావారి పల్లెలోనే ఉండి సంక్రాంతి జరుపుకోనున్నారు. సంప్రదాయ పద్దతిలో బోగు మంటలు వేసి గ్రామస్థులతో గడపనున్నారు.

నారా, నందమూరి కుటుంబ సభ్యులు సంక్రాంతికి ఒక రోజు ముందే నారావారిపల్లెకు రావడం ఎంతో ఆనందంగా ఉందంటున్నారు గ్రామస్థులు. నారావారిపల్లె చుట్టుపక్కల ఉన్న గ్రామాల ప్రజలంతా ఈ వేడుకల్లో పాల్గొంటున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories