Top
logo

వైభవంగా సంక్రాంతి సంబరాలు.. తెలుగు లొగిళ్లలో ముత్యాల ముగ్గులు

వైభవంగా సంక్రాంతి సంబరాలు.. తెలుగు లొగిళ్లలో ముత్యాల ముగ్గులు
X
వైభవంగా సంక్రాంతి సంబరాలు.. తెలుగు లొగిళ్లలో ముత్యాల ముగ్గులు
Highlights

సూర్యుడు.. మకరరాశిలోకి ప్రవేశించడమే సంక్రాంతి పర్వదినం. సంవత్సరానికి పన్నెండు సంక్రాంతులు ఉంటాయి. అయినా...

సూర్యుడు.. మకరరాశిలోకి ప్రవేశించడమే సంక్రాంతి పర్వదినం. సంవత్సరానికి పన్నెండు సంక్రాంతులు ఉంటాయి. అయినా పుష్యమాసంలో, హేమంత ఋతువులో, మంచు కురిసే సమయంలో సూర్యుడు మకరరాశిలోకి మారగానే వచ్చే మకర సంక్రాంతికే అధిక ప్రాముఖ్యత ఉంది. ఈ సమయంలో సూర్యుడు ఉత్తరాయణపథంలో అడుగుపెడతాడు. ఈరోజు నుంచి స్వర్గద్వారాలు తెరచి ఉంటాయని పురాణాలు పేర్కొన్నాయి. దేశవ్యాప్తంగా జరుపుకునే ఈ పండగను ఆంధ్రులు, తమిళులు ఘనంగా జరుపుకుంటారు. భోగి, సంక్రాంతి, కనుమ, ముక్కనుమ పేర్లతో నాలుగు రోజుల పండగను అత్యంత ఘనంగా నిర్వహిస్తారు. ముఖ్యంగా పంట చేతికొచ్చిన ఆనందంలో రైతులు ఈ పండుగ జరుపుకుంటారు కాబట్టి దీన్ని రైతుల పండుగగా కూడా అభివర్ణిస్తారు.

ఈ పండగ రోజున తెలుగు లోగిళ్లు కళకళలాడుతున్నాయి. ఇళ్ల ముందు రంగవల్లులు, గొబ్బెమ్మలతో అలంకరణ మామిడి తోరణాలు, కొత్త అల్లుళ్ల సందడి, బావా మరదళ్ల సరసాలు బంధువుల రాకపోకలతో వాతావరణం అంతా కోలాహలంగా మారుతుంది. ఇక కోడి పందాలు, ఎద్దుల బల ప్రదర్శన, ఇతర ఆటలు కూడా సంస్కృతిలో రావడంతో సందడంతా సంక్రాంతిదే.

Web Titlesankranthi celebrations in telugu states
Next Story