తిరుపతిలో విషాదం...వ్యాక్సిన్ వికటించి శానిటరీ వర్కర్ మృతి

X
Representational Image
Highlights
* వ్యాక్సినేషన్ అనంతరం కుప్పకూలిన కృష్ణయ్య * ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి
Sandeep Eggoju10 Feb 2021 6:52 AM GMT
తిరుపతిలో విషాదం చోటుచేసుకుంది. కరోనా వ్యాక్సిన్ వికటించి శానిటరీ వర్కర్ మృతి చెందిన ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. మల్లంగుంట పంచాయతీ అంబేద్కర్ కాలనీకి చెందిన కృష్ణయ్య కరోనా వ్యాక్సిన్ వేయించుకున్నాడు. అనంతరం ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. దీంతో కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ కృష్ణయ్య కన్నుమూశాడు. వ్యాక్సిన్ వేయించుకుని 24 గంటలు గడవకముందే కృష్ణయ్య మృతి చెందాడని ఆరోపిస్తున్నారు బంధువులు. వ్యాక్సిన్ వద్దన్నా బలవంతంగా వేయించారని, అందువల్లే చనిపోయాడని అంటున్నారు.
Web TitleSanitary Worker Lost his Life After Corona Vaccination in Tirupati
Next Story