Anantapur: వైభవంగా బాబయ్య స్వామి గంధం వేడుకలు

Anantapur: వైభవంగా బాబయ్య స్వామి గంధం వేడుకలు
x
Highlights

అనంతపురం జిల్లా పెనుకొండలో ప్రసిద్ది గాంచిన బాబయ్య స్వామి దర్గా దక్షిణ భారతదేశం లోనే ప్రసిద్ది గాంచినది.

పెనుకొండ: అనంతపురం జిల్లా పెనుకొండలో ప్రసిద్ది గాంచిన బాబయ్య స్వామి దర్గా దక్షిణ భారతదేశం లోనే ప్రసిద్ది గాంచినది. సర్వమత సమ్మేళనం మత సామరస్యానికి ఈ దర్గా ఒక నిదర్శనం గా నిలిచింది. హిందూ ముస్లిం లు అనే తేడా లేకుండా భక్తులు దర్గాలోని బాబయ్య స్వామి సమాధిని దర్శించు కొని ప్రార్థనలు చేస్తుంటారు ప్రతి సంవత్సరం జరిగినట్లుగానే ఈ సంవత్సరం కూడా బాబయ్య స్వామి 747 వ ఉరుసు మహోత్సవాలు దర్గా పీఠాధిపతి తాజ్ బాబా ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.

వచ్చిన భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా త్రాగడానికి నీరు భోజన సదుపాయాలను పీఠాధిపతి తాజ్ బాబా అందజేశారు. ఈ గంధం వేడుకలలో ముందుగా సర్వమత సమ్మేళనం కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో మత పెద్దలు గురువులు పాల్గొని వారి యొక్క మత ప్రవచనాలను భక్తులకు వివరించారు ప్రతి ఒక్కరూ ఐకమత్యంగా ఉండాలని మతం యొక్క విశిష్టతను వివరించారు అనంతరం వైభవంగా శాండల్ మహాల్ నుండి వివిధ వన మూలికలు, సుగంధ ద్రవ్యాలు, గులాబీ పూలతో తయారు చేసిన గంధాన్ని దర్గా పీఠాధిపతి తాజ్ బాబా మరియు 5 మంది 5 రకాల ఫకీర్లు వెంటరాగా గంధం బాబాయ్ స్వామి సమాధికి సమర్పించారు ఈ గంధం తీసుకెళ్తున్నప్పుడు డబ్బులు, ఫకీర్లు విన్యాసాలతో చూపరులకు కనువిందు చేశారు.

ఈ గంధం మహోత్సవానికి ఆంధ్రా, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర రాష్ట్రాల నుండే కాకుండా సింగపూర్, దుబాయ్ తదితర దేశాల నుండి వేలాది మంది భక్తులు పాల్గొన్నారు. ఈ గంధం కార్యక్రమం రాత్రి 8 గంటల నుండి తెల్లవారుజామున 2 గంటల వరకు కొనసాగింది. భక్తులు రాత్రి 8 గంటల నుండి 2 గంటల వరకు కూడా భక్తిశ్రద్ధలతో దర్గా వద్ద వేచి ఉండి బాబయ్య స్వామి సమాధిని దర్శించుకున్నారు. ఈ ఉరుస కార్యక్రమంలో ఎక్కడ కూడా కొట్లాటలు, దొంగతనాలు, మరి ఎటువంటి మోసాలు జరగకుండా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories