ఇసుక అక్రమ రవాణా చేసిన వ్యక్తికి మూడేళ్ల జైలు శిక్ష

ఇసుక అక్రమ రవాణా చేసిన వ్యక్తికి మూడేళ్ల జైలు శిక్ష
x
Highlights

ఇసుక అక్రమ రవాణా చేస్తే రెండేళ్ల జైలుశిక్ష తోపాటు రూ.2 లక్షల జరిమానా విధించేలా చట్ట సవరణ చేసేందుకు రాష్ట్ర మంత్రి మండలి తీర్మానం చేసిన కొద్ది రోజులకే...

ఇసుక అక్రమ రవాణా చేస్తే రెండేళ్ల జైలుశిక్ష తోపాటు రూ.2 లక్షల జరిమానా విధించేలా చట్ట సవరణ చేసేందుకు రాష్ట్ర మంత్రి మండలి తీర్మానం చేసిన కొద్ది రోజులకే తొలి తీర్పు వెల్లడైంది. ఇసుక దొంగతనం కేసులో ఓ వ్యక్తికి కడప కోర్టు రెండేళ్ల జైలు శిక్ష, రూ.5 వేల జరిమానా విధించింది. అంతేకాదు ప్రజా ఆస్తి విధ్వంస నిరోధక చట్టం కింద ఏడాది జైలు శిక్ష, రూ.5 వేల జరిమానా కూడా విధించింది. ఈ రెండు శిక్షలను ఏకకాలంలో అమలు చేయాలని అధికారులను ఆదేశించింది. ఈ మేరకు కడప జిల్లా రెండో అదనపు జ్యుడీషియల్‌ ఫస్ట్‌ క్లాస్‌ మేజిస్ట్రేట్‌ తీర్పు వెలువరించారు.

కాగా కడప జిల్లా పెండ్లిమర్రి మండలం గోపరాజుపల్లికి చెందిన నంద్యాల సుబ్బారాయుడు పాపాగ్ని నదిలో ఇసుకను అక్రమంగా తవ్వుతున్నారంటూ స్థానికులు.. జూలై 15న పెండ్లిమర్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు సుబ్బారాయుడు ఇసుక తవ్వుతున్న ప్రాంతానికి వెళ్లారు. అక్కడ ట్రాక్టర్‌లో అతను ఇసుకను లోడ్‌ చేస్తున్నట్టు కనిపించడంతో అతడని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ నేపథ్యంలో కోర్టు తీర్పు వెలువడింది.

Show Full Article
Print Article
Next Story
More Stories