ఏపీలో మూడు ప్యాకేజీలుగా ఇసుక రీచ్‌లు

ఏపీలో మూడు ప్యాకేజీలుగా ఇసుక రీచ్‌లు
x
Highlights

రాష్ట్రంలోని ఇసుక రీచ్‌లను మూడు ప్యాకేజీలుగా ప్ర భుత్వం ప్రకటించింది. ఇసుక తవ్వకం, నిల్వలు, విక్రయాల బాధ్యతలను నామినేషన్‌ పద్దతిన కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీలు, కేంద్ర ప్రభుత్వరంగ సంస్థలకు ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయిం చింది.

రాష్ట్రంలోని ఇసుక రీచ్‌లను మూడు ప్యాకేజీలుగా ప్ర భుత్వం ప్రకటించింది. ఇసుక తవ్వకం, నిల్వలు, విక్రయాల బాధ్యతలను నామినేషన్‌ పద్దతిన కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీ లు, కేంద్ర ప్రభుత్వరంగ సంస్థలకు ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయిం చింది. ప్రభుత్వం నిర్ణయించిన ధరను ఆయా సంస్థలు చెల్లించాల్సి ఉంటుంది. సీనరేజ్‌, ఇతర పన్నులు దీనికి అదనంగా నిర్ణయించింది. కేంద్ర ప్రభుత్వరంగ సంస్థలు, ఏజెన్సీలు ముందుకురాని పక్షంలో రాష్ట్ర ప్రభుత్వం కనీస టెండర్‌ ధర ఖరారుచేసి టెక్నికల్‌, ఫైనాన్స్‌ బిడ్ల ద్వారా ప్రైవేట్‌ వ్యక్తులకు అప్పగించాలని ఆదేశించింది. నూతన ఇసుక విధానంపై ఇటీవల జరిగిన మంత్రివర్గ సమావేశంలో ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈ మేరకు మార్గదర్శకాలు జారీ అయ్యాయి.

శ్రీ కాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి జిల్లాలు ప్యాకేజి-1, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాలు ప్యాకేజ్‌-2, నెల్లూరు, అనంతపురం, కర్నూలు, కడప, చిత్తూరు జిల్లాలు మూడో ప్యాకేజ్‌గా వర్గీకరించింది. 1 నుంచి 3 వరకు ఆర్డర్‌ స్ట్రీమ్‌తో పాటు ఆపై స్థాయి స్ట్రీమ్స్‌ (నదులు, వాగులు) నిర్వహణ సంస్థలకే అప్పగించి ఇసుక తవ్వకం, నిల్వ, విక్రయాలు పారదర్శకంగా సాగేందుకు వీలుగా ఏపీ వాల్టా, మైనర్‌ మినరల్‌ కన్సెషన్‌ రూల్స్‌ను సవరించనున్నారు. కాంట్రాక్ట్‌ సంస్థలు నోటిఫైడ్‌ రీచ్‌లలో డీ సిల్టేషన్‌ ద్వారా ఇసుక సేకరణకు బోట్స్‌మెన్‌ సొసైటీ సభ్యులను నియమించుకునే వీలు కల్పించింది. నాణ్యతను దృష్టిలో ఉంచుకుని అమ్మకాలు నిర్వహించాలని నిర్దేశించింది. పట్టా భూముల్లో తవ్వకాలు నిలిపివేస్తారు. ఇసుక లభ్యత పెంచేందుకు ధవళేశ్వరం, ప్రకాశం బ్యారేజీలు, రాష్ట్రంలోని ప్రధాన బ్యారేజీల వద్ద డ్రెడ్జింగ్‌ నిర్వహించాలని జలవనరులశాఖకు మార్గదర్శకాలు జారీ చేసింది. భూగర్భ జలవనరులశాఖ ఆధ్వర్యంలో డ్రెడ్జింగ్‌ జరుపుతారు. వినియోగదారులు అవసరమైన మేరకు ఇసుకను నేరుగా బుక్‌ చేసుకుని రీచ్‌ల నుంచే తరలించుకునే వీలు కల్పించింది. దీనిపై పరిమితులు లేవు. స్టాక్‌ యార్డులు, రాష్ట్రంలోని నిర్థారిత నగరాల్లో ప్రభుత్వం నిర్ణయించిన ధరకు ఇసుక రవాణా చేస్తారు.

ఆఫ్‌లైన్‌ విధానంలోనే నగదు చెల్లించి ఇసుకను సరఫరాచేసుకోవచ్చు. స్టాక్‌ యార్డులు, రీచ్‌ల నుంచి ఇసుక తీసుకువెళ్లే వినియోగదారులు రవాణా వసతి ఏర్పాటు చేసుకోవాలి . అవసరమైతే కాంట్రాక్ట్‌ సంస్థల నిర్వహణలో 20 వాహనాలను అందుబాటులో ఉం టాయి. నిర్ణీత ధర చెల్లించి వీటిని వినియోగించుకునే అవకాశం ఉంటుంది. కాంట్రాక్ట్‌ సంస్థలు నిర్ణీత పూచీకత్తు చెల్లించాలి. ప్రజావసరాలకు యడ్లబండ్లపై ఉచితంగా ఇసుకను తీసుకువెళ్లవచ్చు. రీచ్‌లకు సమీపంలోని గ్రామాలకు ఉచిత ఇసుక సరఫరా చేస్తారు. బలహీనవర్గాలకు ప్రభుత్వ గృహ నిర్మాణ ప్రాజెక్ట్‌లు, సహాయ పునరావాస కాలనీలకు కూపన్ల ద్వారా ఇసుకను ఉచితంగా పంపిణీ చేస్తారు. అక్రమ తవ్వకాలు, నిల్వలు, రవాణాను నియంత్రించేందుకు స్పెషల్‌ ఎన్‌ఫోర్‌ ్సమెంట్‌ బ్యూరోకు దాడులు, కేసులు నమోదుచేసే అధికారాలు కల్పించింది. మెరుగైన ఇసుక విధానం ప్రజల సౌలభ్యం కోసం ఎలాంటి అక్రమాలకు తావులేకుండా పారదర్శకంగా కొనసాగాలే అధికారులు పర్యవేక్షించాలని స్పష్టం చేసింది. షెడ్యూల్డ్‌ ఏరియాల్లో ఇసుక రీచ్‌ల నిర్వహణ బాధ్యత ట్రైబల్‌ వెల్ఫేర్‌ సొసైటీలకే అప్పగించింది.

Show Full Article
Print Article
Next Story
More Stories