Sajjala Ramakrishna Reddy: ఉచిత విద్యుత్ సరఫరాపై టీడీపీ ప్రజల్లో అనుమానాలు రేకెత్తిస్తుంది

Sajjala Ramakrishna Reddy: ఉచిత విద్యుత్ సరఫరాపై టీడీపీ ప్రజల్లో అనుమానాలు రేకెత్తిస్తుంది
x

Sajjala Ramakrishna Reddy (File Photo)

Highlights

Sajjala Ramakrishna Reddy: ఏపీ ప్రభుత్వం సంస్కరణల్లో భాగంగా రైతులకు నగదు బదిలీ చేస్తున్నారు.

Sajjala Ramakrishna Reddy: ఏపీ ప్రభుత్వం సంస్కరణల్లో భాగంగా రైతులకు నగదు బదిలీ చేస్తున్నారు. అయితే ప్రతిపక్ష టీడీపీ మాత్రం అప్పు కోసమని, ఉచిత విద్యుత్ ఎత్తివేయడానికే నగదు బదిలీ పథకమని ప్రచారం చేస్తున్నారు.. రైతులకు మేలు చేసేందుకే నగదు బదిలీ పథకం ప్రవేసపెట్టామని., ఈ పథకం ద్వారా రైతులకు ఎలాంటి నష్టం జరగకుండా విద్యుత్ చార్జీలు తగ్గించమని అడిగితే చంద్రబాబు కాల్పులు జరిపించారు. ఆనాడు చంద్రబాబు ఉచిత విద్యుత్ అంటే కరెంట్ తీగలు మీద బట్టలు అరేసుకోవలన్నారు.. ఉచిత విద్యుత్ అనేది రాజశేఖర్ రెడ్డి ప్రకటించిన పథకం..

సుమారు 1100 కోట్లు కరెంట్ బకాయిలను ప్రమాణ స్వీకారం రోజే రాజశేఖర్ రెడ్డి రద్దు చేశారు.. 9 గంటల నాణ్యమైన విద్యుత్ కోసం ఫీడర్లకు 1700 కోట్లు కేటాయించి 35 ఏళ్ళు పాటు ఉచిత విద్యుత్ ఇవ్వడానికి సీఎం జగన్మోహన్ రెడ్డి ఆలోచిస్తున్నారు. అంతే కాదు, ఉచిత విద్యుత్ కోసం 10 వేల మెగావాట్ల విద్యుత్ ప్లాంట్ ఏర్పాటు చేస్తున్నారు.. ప్రజలు ఖాతాల్లో నగదు జమ చేయడం వలన జవాబుదారీతనం పెరుగుతుంది అని రామకృష్ణ రెడ్డి తెలిపారు.

ఒక వేళ డబ్బు రైతుల ఖాతాల్లో వేయడం అలస్యమైన ఉచిత విద్యుత్ అపరు. రైతులకు ఎస్క్రో అకౌంట్స్ ఇస్తున్నామని.. విద్యుత్ మీటర్లు బిగించడం వలన రైతులు ఎంత విద్యుత్ ఉపయోగించుకుంటునన్నారో తెలుస్తుంది అని తెలిపారు. తలతోక లేకుండా ప్రతిపక్ష పార్టీలు ఉచిత విద్యుత్ పై తప్పుడు ప్రచారం చేస్తున్నాయి.. గత ప్రభుత్వం డిస్కములకు చంద్రబాబు వేల కోట్ల బకాయిలు పెట్టారు.. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తరువాత రాష్ట్ర అప్పును 3 లక్షల 60 వేల కోట్లకు పెంచారు. టీడీపీ తెచ్చిన అప్పు మీద లెక్కలు చెప్పగలరా? ఎన్నికల్లో ఓట్లు కోసం ప్రవేశపెట్టినట్లు జగన్మోహన్ రెడ్డి పథకాలు పెట్టలేదు.. ప్రజలకు మేలు జరగాలనే ఉద్దేశ్యంతో పథకాలు ప్రవేశ పెడుతున్నారు అని సజ్జల రామకృష్ణ రెడ్డి మండిపడ్డారు.

Show Full Article
Print Article
Next Story
More Stories