భిన్నాభిప్రాయాలే కానీ విభేదాలు కావు: సజ్జల

భిన్నాభిప్రాయాలే కానీ విభేదాలు కావు: సజ్జల
x

సజ్జల ఫైల్ ఫోటో  

Highlights

తెలంగాణలో రాజన్న రాజ్యం స్థాపనే తన లక్ష్యమని వైఎస్ షర్మిల ప్రకటించారు.

తెలంగాణలో రాజన్న రాజ్యం స్థాపనే తన లక్ష్యమని వైఎస్ షర్మిల ప్రకటించారు. తెలంగాణ వైఎస్ అభిమానులు, తన అనుచరులతో హైదరాబాద్ లోటస్‌ పాండ్‌లో ఆత్మీయ సమావేశం నిర్వహించిన షర్మిల.. కొత్త పార్టీ ఏర్పాటుపై తన మనసులో మాటను బయటపెట్టారు. మంగళవారం వైఎస్ అభిమానులు, అనుచరులతో సమావేశం నిర్వహించిన షర్మిల త్వరలో అన్ని జిల్లాల నేతలతో ఒక్కోరోజు భేటీకానున్నారు.

షర్మిల పార్టీ ప్రకటనపై వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు. షర్మిల నిర్ణయం ఆమె వ్యక్తిగతం అన్నారు. మంగళవరం మీడియాతో మాట్లాడిన ఆయన... ''తెలంగాణ రాజకీయాలపై సీఎం జగన్‌ స్పష్టమైన వైఖరితో ఉన్నారు. వైసీపీ పదేళ్ల సుదీర్ఘ పోరాటం తర్వాత జగన్‌ అధికారంలోకి వచ్చారు. రెండు రాష్ట్రాలు పరస్పరం సహకరించుకోవాలన్నదే ఆయన ఆలోచన అని చెప్పుకొచ్చారు. వైఎస్‌ షర్మిల పరిచయం తెలుగు రాష్ట్రాల ప్రజలకు సుపరిచితమేనన్నారు. ప్రస్తుత పరిణామాలపై తప్పుడు భాష్యం వచ్చే అవకాశముందని సజ్జల అన్నారు.

రాజకీయ సిద్ధాంతంపై భిన్నాభిప్రాయాలు ఉండొచ్చు. కానీ అన్నా చెల్లెళ్ల మధ్య ఎలాంటి విభేదాలు లేవని చెప్పారు సజ్జల. తెలంగాణలో పార్టీ వద్దు అని ఒక స్థిరమైన అభిప్రాయంతో సీఎం జగన్‌ ఉన్నారు. షర్మిల మాత్రం పాదయాత్ర చేసి, పార్టీ పెట్టాలన్నట్టు కనిపిస్తున్నారు. తండ్రి స్పూర్తితో అధికారంలోకి వచ్చిన సీఎం జగన్‌ రాష్ట్రానికి జవాబుదారీ. షర్మిల తీసుకున్న నిర్ణయం ఆమె సొంత నిర్ణయం అని చెప్పారు.

ఓదార్పు యాత్ర వద్ద కాంగ్రెస్ అధిష్టానంపై తిరుగుబాటు చేసి వైఎస్‌ జగన్‌, విజయమ్మ కాంగ్రెస్‌ను వీడి వచ్చారు. ఆ తర్వాత వైఎస్‌ను అభిమానించే నాయకులు పార్టీలో చేరారు. వైసీపీనీ తెలంగాణ కంటే ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమని భావించామని సజ్జల తెలిపారు. తెలంగాణలో పార్టీ వద్దని సీఎం జగన్‌ సూచించారు. తెలంగాణలోకి వెళ్లాలన్న ఆలోచన పార్టీకి ఏ మాత్రం లేదు. భిన్నాభిప్రాయాలే కానీ విభేదాలు కావు అని సజ్జల అన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories