మీసం మెలేస్తారు... కాలు ఎత్తి చూపిస్తారు..ర‌ఘురామపై సజ్జల కామెంట్స్

Sajja Comments On Raghu rama
x

Sajjala Ramakrishna Reddy File Photo 

Highlights

Sajjala Ramakrishna Reddy: వైసీపీ రెబ‌ల్ ఎంపీ రఘురామకృష్ణరాజు తీరుపై అనేక అనుమానాలు కలుగుతున్నాయని ఏపీ ప్రభుత్వ ముఖ్య సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి...

Sajjala Ramakrishna Reddy: వైసీపీ రెబ‌ల్ ఎంపీ రఘురామకృష్ణరాజు తీరుపై అనేక అనుమానాలు కలుగుతున్నాయని ఏపీ ప్రభుత్వ ముఖ్య సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు. రఘురామ అరెస్టు విష‌యంలో ఎక్కడైనా ప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహరించడమో లేక, మానవ హక్కులకు భంగం కలిగేలా వ్యవహరించడమో చేయ‌లేద‌ని ఆయ‌న అన్నారు. సీఎంకు ఆపాదించడం, బురద చల్లాలని చూడడం దుర్మార్గమ‌ని.. టీడీపీకి మొదటి నుంచి ఇది అలవాటే అంటూ స‌జ్జ‌ల మండిప‌డ్డారు.

ఈ సంద‌ర్బంగా మాట్లాడిన ఆయ‌న‌.. రఘురామ ఓ పక్క మీసం మెలేస్తారు.. మరో పక్క అరికాలు ఎత్తి చూపిస్తారు. మళ్లీ కారు దిగిన తర్వాత నడవలేనట్టుగా భుజంపై ఆసరాతో వెళతారు. ఎందుకు అలా చేస్తున్నారో అర్ధం చేసుకోవాల‌ని అన్నారు. రాఘురామ వ్య‌వ‌హారంలో ప్ర‌భుత్వానికి నిదించడం చూస్తే.. టీడీపీ కుట్ర పూరితంగా చేస్తుంద‌నే అనుమానం క‌లుగుతుంద‌ని స‌జ్జ‌ల అన్నారు. కోర్టుకు హాజరైన సందర్భంగా రఘురామకృష్ణరాజు కుటుంబ సభ్యులు కూడా వచ్చారని, భోజనం కూడా తెచ్చారని వివరించారు. హైకోర్టులో వ్యతిరేక ఫలితం వచ్చిన వెంటనే డ్రామా మొదలైందని అన్నారు.

రఘురామ వ్యాఖ్యలు సీఎంపైనే కాకుండా కులాలు, మతాలు, ప్రభుత్వ పథకాలపైనా వ్యాఖ్యలు చేశాడని వివరించారు. మానసిక స్థితి సరిగాలేకనో, మానసిక స్థితి సరిగాలేకనో, ఆక్రోశం భరించలేకనో అన్నాడంటే సరిపెట్టుకోవచ్చు... కానీ రఘురామ వ్యాఖ్యల వెనుక కుట్రకోణం ఉంది అని సజ్జల రామకృష్ణారెడ్డి ఆరోపించారు

ఈ సందర్భంగా చంద్రబాబుపైనా సజ్జల వ్యాఖ్యలు చేశారు. రఘురామ కేసులో రాజద్రోహం అంటే ఏంటో తనకు తెలియదని, అసలా పదమే చంద్రబాబు అంటున్నారని తెలిపారు. గతంలో చంద్రబాబు హయాంలోనే కేసీఆర్ పై 12 పర్యాయాలు రాజద్రోహం కేసులు నమోదు చేశారని పేర్కొన్నారు. మరి ఆ రోజు ఇది రాజకీయమని, దాన్ని రాజకీయంతోనే తేల్చుకోవాలని చంద్రబాబుకు అనిపించలేదా అని సజ్జల రామకృష్ణారెడ్డి ప్రశ్నించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories