చంద్రబాబు మానసిక రోగిలా ప్రవర్తిస్తున్నారు : సజ్జల రామకృష్ణారెడ్డి

చంద్రబాబు మానసిక రోగిలా ప్రవర్తిస్తున్నారు : సజ్జల రామకృష్ణారెడ్డి
x
చంద్రబాబు మానసిక రోగిలా ప్రవర్తిస్తున్నారు
Highlights

ఏపీ ప్రతిపక్ష నేత, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుపై నిప్పులు చెరిగారు ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి.

ఏపీ ప్రతిపక్ష నేత, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుపై నిప్పులు చెరిగారు ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి. చంద్రబాబు కియా పరిశ్రమపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. ప్రజలు చంద్రబాబును తిరస్కరిచినా మార్పు రాలేదని విమర్శించారు. రాజధాని ఏర్పాటు విషయంలో చంద్రబాబు అడ్డగోలుగా నిర్ణయం తీసుకున్నారని మండిపడ్డారు. తాడేపల్లిలోని వైసీపీ కార్యాలయంలో మీడియా సమావేశంలో సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడారు. రైతుల పేరుతో తెలుగుదేశం కార్యకర్తలు ఆందోళనలు చేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో ఎవరిని సంప్రదించకుండా ఆయనే రాజధానికి నిర్ణయం తీసుకున్నారని విమర్శించారు.

ఎన్నికల్లో చంద్రబాబును ప్రజలు తిరస్కరించిన బుద్ది రాలేదని దుయ్యబట్టారు. చంద్రబాబు మానసిక రోగిలా ప్రవర్తిస్తున్నారని, ప్రజలు, ప్రజాస్వామ్యంపై లెక్కలేకుండా ఆయన ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. ఓటుకు నోటు కేసుకు భయపడి రాత్రికి రాత్రే హైద్రబాబ్ నుంచి విజయవాడకు పారిపోయి వచ్చారని విర్శించారు. చంద్రబాబు తుగ్లక్ అని ప్రజలు తీర్పు ఇచ్చి, ఎన్నికల్లో జగన్ కి పట్టం కట్టారని చెప్పారు. ప్రభుత్వంపై విమర్శులు చేయడమే పనిగా పెట్టుకున్నారని ప్రజాస్వామ్యం అంటే లెక్కలేకుండా పోయిందని విమర్శిచారు. రాజధాని విషయంలో ప్రజా అభిప్రాయం తీసుకున్నారా అని ప్రశ్నించారు. అమరావతిలోనే చంద్రబాబు తనయుడు లోకేశ్‌ను ప్రజలు తిరస్కరించారని సజ్జల రామ కృష్ణారెడ్డి అన్నారు.

రాజధానికి లక్షకోట్లు ఖర్చు చేస్తే మౌలిక వసతులు కల్పించగలంమని ఇప్పుడు ఆ డబ్బు ఎక్కడ నుంచి వస్తుందని ప్రశ్నించారు. వికేంద్రీకరణ ఎందుకు చేస్తున్నారో సీఎం స్పష్టంగా చెప్పారన్నారు. విశాఖను పరిపాలనా రాజధానిగా.. శాసన రాజధానిగా అమరావతిని కొనసాగిస్తామని, కర్నూలును న్యాయ రాజధానిగా సీఎం స్పష్టంగా చెప్పారు. మూడు ప్రాంతాలకి న్యాయం చేయాలనే సీఎం జగన్ ఆలోచన అని వెల్లడించారు. అమరావతి రైతులు నష్టపోకూడదనే 10 ఏళ్ల కౌలును, 15 ఏళ్లకు పెంచారని అన్నారు.

అమరావతిలో ఉద్యోగులు ఎందుకు నివాసం ఏర్పాటు చేసుకోలేదో చంద్రబాబు చెప్పాలని ప్రశ్నించారు. సీఎం జగన్ చంద్రబాబులా విజన్ పేరుతో కాలయాపన చేయడం లేదని అన్నారు. ప్రజలను చంద్రబాబు రాజకీయం కోసం రెచ్చగొడుతున్నారని ఆరోపించారు. మరోవైపు పవన్‌ కల్యాణ్‌పై కూడా విమర్శలు ఎక్కుపెట్టారు. చంద్రబాబు వ్యాఖ్యలుగానే పవన్‌ నుంచి వస్తున్నాయని ఆరోపించారు. సీఎస్‌ సెలవులో వెళ్లారని ఒకరోజు.. కియా తరలి వెళ్లిందని తప్పుడు ప్రచారం చేస్తున్నారని, మండలి ఆమోదం, సభలో తీర్మానం చేయకముందే ఛైర్మన్ విచక్షణాధికారాన్ని ఎలా ఉపయోగిస్తారు. కౌన్సిల్‌ నిబంధనలకు విరుద్ధంగా నిర్ణయం తీసుకున్నారని ప్రశ్నిచారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories