Guntur: ముఖ్యమంత్రి సహాయనిధి

Guntur: ముఖ్యమంత్రి సహాయనిధి
x
Sai Teja Construction Builder Subba Reddy
Highlights

గుంటూరుకు చెందిన సాయి తేజ కన్ స్ట్రక్షన్ బిల్డర్ సుబ్బారెడ్డి ముఖ్యమంత్రి సహాయక నిధికి 2 లక్షల రూపాయలు విరాళంగా ఇచ్చారు.

గుంటూరుకు చెందిన సాయి తేజ కన్ స్ట్రక్షన్ బిల్డర్ సుబ్బారెడ్డి ముఖ్యమంత్రి సహాయక నిధికి 2 లక్షల రూపాయలు విరాళంగా ఇచ్చారు.బ్రాడి పేట లోని హోంమంత్రి నివాసంలో సుచరిత ని కలిసి 2 లక్షల రూపాయల చెక్ ను సుబ్బారెడ్డి అందించారు. బివి సుబ్బారెడ్డి తో పాటు బూసిరెడ్డి మల్లేశ్వర రెడ్డి కూడా హోంమంత్రి ని కలిసిన వారిలో ఉన్నారు. కరోనా మహమ్మారిని తరికొట్టేందుకు ఆర్థిక సహాయం చేసిన బివి సుబ్బారెడ్డి కి హోంమంత్రి కృతజ్ఞతలు తెలిపారు.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కోవిడ్ 19 వైరస్ ను రాష్ట్రంలో లేకుండా చేసేందుకు విశ్వప్రయత్నాలు చేస్తోందని సుబ్బారెడ్డి పేర్కొన్నారు. ప్రపంచవ్యా ప్తంగా కోవిద్ 19 భారిన అనేక మంది చనిపోతున్నారని..ప్రజలంతా పూర్తి అప్రమత్తతో ఉండాలన్నారు. ఇప్పటికే లాక్ డౌన్ కారణంగా కరోనా వైరస్ సోక కుండా జాగ్రత్త పడ్డామని తెలిపారు. రానున్న రోజుల్లో మరింత జాగ్రత్తగా ఉంటేనే కరోనా ను జయించవచ్చని బిల్డర్ సుబ్బారెడ్డి పేర్కొన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories