బైక్ పై విన్యాసాలు చేస్తూ కిందపడ్డ సాయి.. తలకు తీవ్ర గాయం కావడంతో చికిత్స పొందుతూ మృతి

Sai Fell Down and Died while Doing Stunts on the Bike
x

బైక్ పై విన్యాసాలు చేస్తూ కిందపడ్డ సాయి.. తలకు తీవ్ర గాయం కావడంతో చికిత్స పొందుతూ మృతి

Highlights

Vuyyuru: సోషల్‌ మీడియాలో లైక్‌ల కోసం స్టంట్స్

Vuyyuru: బైక్ రేస్... యువత రయ్ రయ్ మంటూ రోడ్లమీద దూసుకుపోతారు. ఖరీదైన బైక్‌లు రోడ్ల మీద విన్యాసాలు చేస్తాయి. ఈ కల్చర్ కేవలం హైదరాబాద్, వైజాగ్, విజయవాడ వంటి నగరాలకు పరిమితం కాలేదు. ఇంతింతై వటుడింతై అన్నట్టుగా చిన్న చిన్న పట్టణాలకు కూడా ఈ బైక్ రేసింగ్ ధోరణి పాకిపోయింది. హై టేక్ బైక్ రేసులు ఇప్పుడు కృష్ణ జిల్లాలోని ఉయ్యూరుకు కూడా పాకాయి. విజయవాడ నుండి మచిలీపట్నం వరకు వేసిన కొత్త హైవేపై యువత రెచ్చిపోతున్నారు.

సర్వీస్ రోడ్లను సైతం విడిచిపెట్టకుండా బైక్ లపై విన్యాసాలు చేస్తూ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. సోషల్ మీడియా లైక్‌ల కోసం బైక్ పై వెర్రి వేషాలు వేస్తూ ఓ యువకుడు ప్రాణాలు పోగొట్టుకున్నాడు. గత 6 నెలలలుగా ఉయ్యూరులో జరుగుతున్న బైక్ రేస్‌లు విన్యాసాలతో తల్లిదండ్రులు భయబ్రాంతులకు గురవుతున్నారు.

ఎన్నిసార్లు హెచ్చరించిన సాయి మారకపోగా 20 రోజుల క్రితం బైక్ పై నిలబడి విన్యాసాలు చేస్తూ అదుపు తప్పి కింద పడ్డాడు. తలకు బలమైన గాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మృతి చెందాడు. బైక్ రేస్‌ల సంస్కృతి వల్ల యువకులు పాడైపోతున్నారని, ప్రాణాల మీదకి తెచ్చుకుని కన్నవారికి శోకం మిగులుస్తున్నారని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు ఈ తరహా సంస్కృతికి చెక్ పెట్టాలని,ఉయ్యూరు నుంచి మచిలీపట్నం, విజయవాడకు వెళ్ళే ప్రాంతాల్లో నిఘా ఉంచాలని కోరుతున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories