బీజేపీలోకి సాధినేని యామిని!

బీజేపీలోకి సాధినేని యామిని!
x
Highlights

టీడీపీ నేత సాధినేని యామిని శర్మ త్వరలో బీజేపీలో చేరనున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఆమె ఇప్పటికే బీజేపీ నేతలతో సంప్రదింపులు జరుపుతున్నట్టు సమాచారం. ఆమె...

టీడీపీ నేత సాధినేని యామిని శర్మ త్వరలో బీజేపీలో చేరనున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఆమె ఇప్పటికే బీజేపీ నేతలతో సంప్రదింపులు జరుపుతున్నట్టు సమాచారం. ఆమె బీజేపీ పెద్దల సమక్షంలో కమలం తీర్ధం తీసుకుంటారని తెలుస్తోంది. ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణను కలిసిన యామిని పార్టీలో చేరికపై చర్చించినట్టు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. కాగా యామిని గత ఎన్నికల్లో టీడీపీ విజయం కోసం సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. ఎన్నికల ఫలితాల అనంతరం ఆమె మీడియాకు దూరంగా ఉంటున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories