గుంటూరులో వికటించిన టీనేజ్ లవ్.. ప్రేమికుడు మృతి..

గుంటూరులో వికటించిన టీనేజ్ లవ్.. ప్రేమికుడు మృతి..
x
Highlights

గుంటూరు జిల్లాలో టీనేజ్ లవ్ వికటించింది. పెద్దల గొడవతో మనస్తాపం చెందిన బాలిక , బాలుడు ఆత్మహత్యాయత్నం చేశారు. దీంతో బాలుడు మృతి చెందగా, బాలిక చావు...

గుంటూరు జిల్లాలో టీనేజ్ లవ్ వికటించింది. పెద్దల గొడవతో మనస్తాపం చెందిన బాలిక , బాలుడు ఆత్మహత్యాయత్నం చేశారు. దీంతో బాలుడు మృతి చెందగా, బాలిక చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోంది. ఈ ఘటన గుంటూరు జిల్లా మాచర్ల మండలం బీకే పాలెంలో జరిగింది. గ్రామానికి చెందిన బాలుడు (17), బాలిక (16) కొద్దిరోజులుగా ప్రేమించుకుంటున్నారు. అయితే వీరి ప్రేమ వ్యవహారం తెలిసి ఇరు కుటుంబాల పెద్దలు గొడవ పడుతున్నారు. ఈ క్రమంలో ఇటీవల అవి తీవ్రతరం అయ్యాయి. దాంతో తాము ప్రేమించుకోవడం వల్లే ఈ గొడవలు జరుగుతున్నాయని బాలిక మనస్తాపం చెందింది.

దాంతో బాత్రూంలో ఉన్న ఫినాయిల్ ను తాగి ఆత్మహత్యాయత్నం చేసింది. ప్రియురాలు ఆత్మహత్యాయత్నం చేసిందన్న విషయం తెలుసుకున్న ప్రియుడు పురుగుల మందు తాగాడు.. అతడి పరిస్థితిని గమనించిన కుటుంబసభ్యులు ఆసుపత్రికి తరలిస్తున్నారు.అయితే దురదృష్టవశాత్తు ఆసుపత్రికి తరలించేలోపే ఆ బాలుడు ప్రాణాలు కోల్పోయాడు. మరోవైపు, ఫినాయిల్ తాగిన బాలిక ప్రాణాపాయం నుంచి బయటపడింది. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories