సున్నా మార్కులు వచ్చినా సచివాలయ ఉద్యోగం

సున్నా మార్కులు వచ్చినా సచివాలయ ఉద్యోగం
x
Highlights

వైసీపీ ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతితాత్మకంగా ఏర్పాటు చేసిన గ్రామ సచివాలయ వ్యవస్థలో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. కొన్ని జిల్లాల్లో ఎస్సీ, ఎస్టీ

వైసీపీ ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన గ్రామ సచివాలయ వ్యవస్థలో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. కొన్ని జిల్లాల్లో ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ పోస్టులు పూర్తిగా భర్తీ కాలేదు.. దీనికి ప్రధాన కారణాలు రెండు ఉన్నాయి.. అందులో ఒకటి ఆయా వర్గాల అభ్యర్ధులు పరీక్షలో కటాఫ్ మార్క్ కి చేరకపోవడం.. రెండోది వారిలో ఆల్రెడీ ఉద్యోగం ఉన్న వాళ్ళు కూడా ఎంపిక కావడమే.

వాస్తవానికి ఇద్దరికి కలిపి 21 శాతం రిజర్వేషన్ ప్రకారం ఎస్సీ, ఎస్టీ లకు కేటాయించిన ఉద్యోగాలు వారికే ఇవ్వాల్సి ఉంటుంది. ఈ క్రమంలో కడప జిల్లాలో కూడా ఎస్సీ, ఎస్టీ పోస్టులు మిగిలిపోయాయి. కటాఫ్ మార్కులు తగ్గించి పోస్టులు భర్తీ చేయాలనీ అనుకున్నా కూడా పోస్టులు ఇంకా మిగిలిపోయాయి. దాంతో ఎలాగో రిజర్వేషన్ ప్రకారం ఎస్సీ, ఎస్టీ లకు కేటాయించిన ఉద్యోగాలు వారికే ఇవ్వాలి గనక సున్నా మార్కులు వచ్చిన అభ్యర్థిని కూడా పరిగణలోకి తీసుకుంటున్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories