రాష్ట్రం ఈ స్థితిలో ఉండటానికి వైయస్ఆర్ ఓ కారణం : సబితా ఇంద్రారెడ్డి

రాష్ట్రం ఈ స్థితిలో ఉండటానికి వైయస్ఆర్ ఓ కారణం : సబితా ఇంద్రారెడ్డి
x
Highlights

మాజీ హోమ్ మంత్రి, మహేశ్వరం కాంగ్రెస్ ఎమ్మెల్యే పటోళ్ల సబితా ఇంద్రారెడ్డి టీఆరెస్ లో చేరుతున్నట్టు స్పష్టమైంది. గురువారం ఆమె మహేశ్వరం మాజీ ఎమ్మెల్యే...

మాజీ హోమ్ మంత్రి, మహేశ్వరం కాంగ్రెస్ ఎమ్మెల్యే పటోళ్ల సబితా ఇంద్రారెడ్డి టీఆరెస్ లో చేరుతున్నట్టు స్పష్టమైంది. గురువారం ఆమె మహేశ్వరం మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డిని కలిశారు. ఈ సందర్బంగా టీఆరెస్ లో చేరుతున్నానని.. కార్తీక్ రెడ్డికి సహకరించాలని ఆమె కృష్ణారెడ్డిని కోరారు. అనంతరం సబిత మాట్లాడుతూ.. నియోజకవర్గ అభివృద్ధికోసమే టీఆరెస్ లో చేరుతున్నట్టు తెలిపారు.

'నాకు గుర్తింపు రావడానికి కారణమైన కార్యకర్తలకు ధన్యవాదాలు.. ప్రజలు కేసీఆర్ నాయకత్వాన్ని బలపరుస్తున్నారు. ప్రాంతీయపార్టీలతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యం. ఇంద్రారెడ్డి కూడా ప్రాంతీయ పార్టీలోనే ఉన్నారు. రాష్ట్రం ఈ స్థితిలో ఉండటానికి దివంగత ముఖ్యమంత్రి వైయస్ఆర్ కూడా ఓ కారణం. ఎన్నికలేవైనా టీఆర్ఎస్ దే విజయం అవ్వాలని కోరుకుంటున్నా' అని సబిత వెల్లడించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories