Siddharth Reddy: స్వపక్షనేతలపై ఏపీ శాప్‌ చైర్మన్ సిద్ధార్థ్‌రెడ్డి ఆగ్రహం

SAAP Chairman Siddharth Reddy is Angry with the Party Leaders about Water Problem in  Nandikotkur Constituency
x

బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి (ఫైల్ ఫోటో)

Highlights

*పాలక పార్టీలో ఉండి కూడా కార్యకర్తలకు, అభిమానులకు సహాయం చేయలేకపోతున్నానని ఆవేదన

Siddharth Reddy: ఏపీ ప్రభుత్వం తనకిచ్చిన పదవి తనకు అంత ముఖ్యం కాదని ఘాటుగా వ్యాఖ్యలు చేసారు స్పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఆంధ్రప్రదేశ్‌ చైర్మన్‌ సిద్ధార్థరెడ్డి. రెండున్నరేళ్లుగా అధికార పార్టీలో తాను ఉన్నా సొంత పనుల కోసం వైసీపీ కార్యకర్తలు, తనను అభిమానించేవారు తన వద్దకు వచ్చినా అధికారుల చర్యలతో ఏ సహాయం చేయలేక పోతున్నానని ఆగ్రహం వ్యక్తం చేసారు.

ఉన్నది ఉన్నట్లు మాట్లాడటం, చెప్పాలనుకున్నది ఎంత మందిలో ఉన్న తడబాటు లేకుండా చెప్పటం అది ప్రతి పక్షమైనా, స్వపక్షమైనా కుండ బద్దలు కొట్టే వ్యక్తి బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి . ఇటీవల జరిగిన ఓ సభలో ఈ యువనేత చేసిన ఘాటు వ్యాఖ్యలు రాజకీయ సెగలు రగిలిస్తున్నాయి.

సొంత నియోజకవర్గమైన నందికొట్కూరు అభివృద్ధి విషయంలో సిద్ధార్థ రెడ్డి చాలా ఘాటుగా స్పందించారు. రాయలసీమకు నీళ్లు అందించే ప్రతి పథకం నందికొట్కూరు నియోజకవర్గ పరిధిలో వున్నా ఇప్పటివరకు నియోజకవర్గంలో తాగునీటి కోసం ప్రజలు పడుతున్న ఇబ్బందులను ఏ నాయకుడు గుర్తించ లేదని, వారు ఎదుర్కొంటున్న సమస్యలను తీర్చేందుకు ఎవరూ ముందుకు రాలేదని ఘాటుగా విమర్శించారు.

నందికొట్కూరు ఎమ్మెల్యే తోగురు ఆర్ధర్‌కు శాప్ చైర్మన్ సిద్ధార్థ రెడ్డికి మధ్య ఉన్న సంబంధాలు ఉప్పూనిప్పు‌గా మారాయని ఇప్పటికే నియోజక ప్రజలు చెవులు కొరుక్కుంటున్నారు.


Show Full Article
Print Article
Next Story
More Stories