Gudivada: లంచం తీసుకుంటూ అడ్డంగా పట్టుబడ్డ రూరల్ సీఐ

Rural CI Caught Taking Bribe In Gudivada
x

Gudivada: లంచం తీసుకుంటూ అడ్డంగా పట్టుబడ్డ రూరల్ సీఐ

Highlights

Gudivada: ఏసీబీని ఆశ్రయించిన ఇమేజ్ డిజిటల్స్ ఓనర్ రవికుమార్

Gudivada: కృష్ణా జిల్లా గుడివాడ రూరల్ పోలీస్‎స్టేషన్‎లో ఏసీబీ అధికారులు దాడులు చేశారు. 75 వేలు లంచం తీసుకుంటూ రూరల్‌ సీఐ జయకుమార్ అధికారులకు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు. కాగా సీఐ జయకుమార్ పై ఇమేజ్ డిజిటల్స్ మేనేజర్ ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. ఇటీవల జగన్ గుడివాడ పర్యటనలో గో బ్యాక్ జగన్ అంటూ స్టిక్కర్లు...ఇమేజ్ డిజిటల్స్ ముద్రించింది. అయితే ఈ కేసులో సీఐ తమను వేధిస్తున్నాడంటూ ఇమేజ్ డిజిటల్స్ అధినేత రవికుమార్‌ ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు గుడివాడ రూరల్ పోలీస్ స్టేషన్‌లో దాడులు చేసి సీఐను ఉన్నఫలంగా పట్టుకున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories