AP Elections: పంచాయతీ ఎన్నికల్లో అధికార పార్టీ హవా

Ruling Party Highlight in Andhra Pradesh Panchayat Elections
x
వైసీపీ (ఫైల్ ఇమేజ్)
Highlights

Andhra Pradesh: పంచాయతీ సమరంలో అధికార పార్టీదే హవా వైసీపీ ఎమ్మెల్యేల వ్యూహాలకు టీడీపీ కంచుకోటలు బద్ధలయ్యాయి. సీనియర్ నాయకులు, మాజీ మంత్రులు సొంత...

Andhra Pradesh: పంచాయతీ సమరంలో అధికార పార్టీదే హవా వైసీపీ ఎమ్మెల్యేల వ్యూహాలకు టీడీపీ కంచుకోటలు బద్ధలయ్యాయి. సీనియర్ నాయకులు, మాజీ మంత్రులు సొంత ఇలాకాలో చతికలపడ్డారు. ఎన్నికలు ఇప్పుడే వద్దన్న వైసీపీ పల్లెల్లో దూసుకెళ్తోంది. విడత ఏదైనా. పోలింగ్‌ ఎక్కడైనా విజయం వైసీపీదే. అక్కడ ఇక్కడా అన్న తేడాలేదు. ఓట్లు సునామీతో చెలరేగిపోయింది.

ఏపీ పంచాయతీ ఎన్నికల్లో మూడు విడతలు పూర్తయ్యాయి. ఇక మిగిలింది చివరి ఫేజ్‌ ఎలక్షన్స్.. ఈ మూడు ఫేసుల్లోనూ అధికార పార్టీ హవా కన్పించింది. టీడీపీ సీనియర్ నేతల ఇలాకాలోనూ ఎదురుదెబ్బ తప్పలేదు. తెలుగుదేశం పార్టీ కంచుకోటల్లోనూ ఆ పార్టీకి డిపాజిట్లు గల్లంతయ్యాయి.

మొన్నటి వరకూ అనంతపురం జిల్లా టీడీపీకి కంచుకోట. 2019 అసెంబ్లీ తర్వాత సీన్‌ రివర్స్ అయ్యింది. పచ్చజెండా పత్తాలేకుండా పోయింది. ఇప్పుడు పంచాయతీ ఎన్నికల్లోనూ అదే పరిస్థితి. పరిటాల సునీత సొంత మండలం రామగిరిలో 26 ఏళ్ల పరిటాల కుటుంబ ఆధిపత్యానికి చెక్ పడింది. అలాగే ధర్మవరం నియోజకవర్గంలోని 70 పంచాయతీల్లో 63 స్థానాల్ని వైసీపీ దక్కించుకుంది. వాయిస్ 4 :

మరో మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు ప్రాతినిధ్యం వహిస్తున్న రాయదుర్గంలో సేమ్‌ స్విచ్‌వేషన్. 87 పంచాయతీల్లో 70 స్థానాల్ని వైసీపీ మద్దతుదారులు కైవసం చేసుకున్నారు. పయ్యావుల కేశవ్ ప్రాతినిధ్యం వహించిన ఉరవకొండ నియోజకవర్గంలో టీడీపీ ఊచకోతకు గురైంది.

గుంటూరు జిల్లా మాచర్లలో మొత్తం 77 పంచాయతీలుంటే.. టీడీపీ కేవలం సింగల్‌ సీటుకే పరిమితమైంది. మిగిలిన సీట్లన్నీ వైసీపీ ఖాతాలో పడిపోయాయి. విశేషమేమిటంటే ఇక్కడ 74 స్థానాలు ముందే ఏకగ్రీవమయ్యాయి.

ఇక మాజీ మంత్రి దేవినేని ఉమా నియోజకవర్గం మైలవరంలో వైసీపీ సత్తా చాటింది. వసంత కృష్ణ ప్రసాద్ వ్యూహాలకు దేవినేని ఉమా వర్గం నిలబడలేక పోయింది. మరో మాజీ మంత్రి యనమల ఇలాకాలోనూ వైసీపే కింగ్‌మేకర్‌గా నిలిచింది. ఇప్పుడు చివరి ఫేజ్‌ పంచాయతీ ఎన్నికలు మిగిలి ఉన్నాయి. మరీ ఈ విడతలోనైనా టీడీపీ పట్టు సాధిస్తుందో లేదో చూడాలి.

కుప్పకూలిన టీడీపీ కంచుకోట...

కుప్పం ప్రజలు చంద్రబాబుకు గట్టి షాక్‌ ఇచ్చారు. పంచాయతీ ఎన్నికల్లో కోలుకోలేని దెబ్బకొట్టారు. నియోజకవర్గంలో 89 పంచాయతీలుంటే 74 చోట్ల వైఎస్సార్‌సీపీ మద్దతుదారులను గెలిపించారు. మరోచోట ఇండిపెండెంట్‌ అభ్యర్థికి పట్టం కట్టారు. టీడీపీ నాయకుల అతినమ్మకమో.. కుప్పం తమ అడ్డా అని ఫీలయ్యారో తెలియదు కాని చివరకు చతికలపడాల్సిన పరిస్థితి వచ్చింది.

1989లో చంద్రబాబు తొలిసారి టీడీపీ ఎమ్మెల్యేగా కుప్పం నుంచి ఎన్నికయ్యారు. తర్వాత వరుసగా ఏడు పర్యాయాలు ఇక్కడ గెలిచారు. మూడుసార్లు సీఎంగా పదవి చేపట్టారు. కుప్పంలో తనకు తిరుగులేదని నిరూపించుకున్నారు. కానీ పంచాయతీ ఎన్నికల్లో చరిత్ర తిరగబడింది. 89 పంచాయతీల్లో 74 పంచాయతీలు అధికారపార్టీ పరమయ్యాయి. టీడీపీ కేవలం 14 గ్రామాలకే పరిమితమైంది. కొన్ని చోట్లయితే టీడీపీ అభ్యర్థులకు డిపాజిట్లు గల్లంతయ్యాయి.

కుప్పంలో వైసీపీ జెండా ఎగురుతుందని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి ముందు నుంచి చెబుతూ వస్తున్నారు. ఇప్పుడదే అక్షర సత్యమైంది. దీంతో వైసీపీ నేతలు చంద్రబాబుపై తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. ఇంతలా పరాభావం పొందాక చంద్రబాబు రాజకీయాల నుంచి తప్పుకుంటే మంచిదని వైసీపీ నాయకులు ఎద్దెవా చేస్తున్నారు.

టీడీపీ కంచుకోట కప్పుకూలడంతో వైసీపీ కార్యకర్తలు, అభిమానులు సంబరాల్లో మునిగారు. పార్టీ శ్రేణులు, అభ్యర్థుల్లో ఆనందానికి అంతులేకుండా పోయింది. బాణసంచా పేలుళ్లు, పలక వాయిద్యాలు, బ్యాండు సన్నాయి, డ్యాన్సులతో హోరెత్తించారు. సీఎం జగన్ ప్రవేశపెట్టిన పథకాలే తమను గెలిపించాయని వైసీపీ మద్దతుదారులు అంటున్నారు

Show Full Article
Print Article
Next Story
More Stories