దేవాలయాల దర్శనంపై కఠిన నిబంధనలు : ఏపీ మంత్రి వెల్లంపల్లి

దేవాలయాల దర్శనంపై కఠిన నిబంధనలు : ఏపీ మంత్రి వెల్లంపల్లి
x
Highlights

కరోనా నేపథ్యంలో దేవుడి దర్శనాలకు అనుమతి ఇస్తున్నా, కఠినమైన నిబంధనలు విధిస్తున్నారు. సాధారణమైన మాస్క్, శానిటైజేషన్ తో పాటు కేంద్రం అమల్లోకి తెచ్చిన...

కరోనా నేపథ్యంలో దేవుడి దర్శనాలకు అనుమతి ఇస్తున్నా, కఠినమైన నిబంధనలు విధిస్తున్నారు. సాధారణమైన మాస్క్, శానిటైజేషన్ తో పాటు కేంద్రం అమల్లోకి తెచ్చిన ఆరోగ్యసేతు యాప్ ను తప్పకుండా ఇన్ స్టాల్ చేసుకోవాలంటూ షరతులు విధిస్తున్నారు. ఇలాంటి వారినే దర్శనానికి అనుమతిస్తామని మంత్రి వెల్లంపల్లి పేర్కొన్నారు.

ఈనెల 8,9 తేదీల్లో అన్ని దేవాలయాల్లో ట్రయల్ రన్ నిర్వహిస్తున్నామని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ తెలిపారు.దేవాలయాల్లో పనిచేసే సిబ్బంది,స్థానికులతో మొదట ట్రయల్ రన్ నిర్వహించి 10 వ తేదీ నుంచి భక్తులకు దర్శనం కల్పిస్తామని తెలిపారు.మరో వైపు దుర్గగుడి కంటోన్మెంట్ జోన్ లో లేదని,శ్రీకాళహస్తి ఆలయం మాత్రం కంటోన్మెంట్ జోన్ లో ఉందని తెలిపారు. భక్తులు ప్రతి ఒక్కరు ఆరోగ్య సేతు యాప్ ఇంస్టాల్ చేసుకోవాలని సూచించారు. ఖచ్చితంగా దర్శనం కు వచ్చేవారు మాస్క్ ధరించి రావాలని నియంత్రణ ప్రకారం దర్శనం కల్పిస్తామని చెప్పారు మంత్రి. కరోనా నేపథ్యంలో భక్తులు ఎక్కువ మంది దర్శనాలకు రావొద్దని స్లాట్ ప్రకారమే దర్శనం కల్పిస్తామన్నారు. ఆన్ లైన్ లో దర్శనం టికెట్స్ తీసుకోవాలి.10 ఏళ్ల లోపు పిల్లలు,వృద్దులు దర్శనాలకు రావొద్దని కోరారు.రాష్ట్రంలోని అన్ని దేవాలయాల్లో అంతరాలయ దర్శనాలు రద్దు చేస్తున్నామని మంత్రి తెలిపారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories